మోడీ మంత్రివ‌ర్గంలో టీఆర్ఎస్

పాలిటిక్స్ అన్నాక నిన్న కొట్టుకున్న వాళ్లు.. నేడు క‌లిసిపోవ‌డం, నేడు తిట్టుకున్న‌వాళ్లు .. రేపు క‌లిసిపోవ‌డం మామూలే. ఇప్పుడు ఇదే సీన్.. తెలంగాణ అధికార పార్టీలోనూ క‌నిపిస్తోంద‌ని స‌మాచారం. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేంద్రం త‌మ‌పై వివ‌క్ష చూపిస్తోంద‌ని, నిధులు స‌రిగా ఇవ్వ‌డం లేద‌ని పెద్ద ఎత్తున విరుచుకుప‌డిన టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ఇప్పుడు కేంద్రంలోని ఎన్‌డీఏ కూట‌మి నేతృత్వ పార్టీ బీజేపీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేందుకు రెడీ అయ్యార‌నే టాక్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వాస్త‌వానికి […]

ఏపీలో న్యూ పాలిటిక్స్‌: బీజేపీ టూ వైకాపా

బీజేపీ విజ‌య‌వాడ నేత‌, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ క‌మ‌ల ద‌ళం నుంచి బ‌య‌ట‌కు జంప్ చేశారు. ఆయ‌న త‌న రాజీనామా ప‌త్రాన్ని బీజేపీ కార్యాల‌యానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ ప‌రిణామం విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిస్థాయిలో ప‌ట్టు సాధిస్తున్న క్ర‌మంలో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలిన‌ట్టే చెప్పొచ్చు. వాస్త‌వానికి వెల్లంపల్లి ప్ర‌జారాజ్యం పార్టీతో పొలిటిక‌ల్ అరంగేట్రం చేశాడు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందాడు. అయితే, చిరు త‌న పార్టీని కాంగ్రెస్‌లో […]

అన్నాడీఎంకేను క‌బ్జా చేసే ప‌నిలో బీజేపీ

ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ రాజ‌కీయాల్లో త‌మిళ‌నాడు హ‌వా కొన‌సాగుతూ వ‌స్తోంది. 39 లోక్‌స‌భ స్థానాలతో దేశంలోనే ఎక్కువ ఎంపీ స్థానాలు క‌లిగిన రాష్ట్రంగా ఉన్న త‌మిళ‌నాడు జాతీయ రాజ‌కీయాల‌ను ఎప్పుడూ శాసిస్తూ వ‌స్తోంది. రాజీవ్‌గాంధీ చ‌నిపోయిన‌ప్పుడు ఇదే జ‌య‌లలిత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అక్క‌డ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేసింది. త‌ర్వాత 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌-డీఎంకేలు పొత్తు పెట్టుకుని గ‌ణ‌నీయ‌మైన సీట్లు సాధించాయి. ఇదే జ‌య‌ల‌లిత మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుని వాజ్‌పేయ్ ప్ర‌భుత్వం ప‌డిపోయేందుకు కార‌ణ‌మ‌య్యారు. […]

ఏపీలో బీజేపీ – టీడీపీ మ‌ధ్య కొత్త చిచ్చు

ఏపీకి ప్రత్యేక హోదా మిత్ర‌ప‌క్షాలు అయిన టీడీపీ – బీజేపీ మ‌ధ్య చాలా రోజుల పాటు చిచ్చు రాజేసింది. ప్ర‌త్యేక హోదా అంశంపై ఏపీలో బీజేపీ, టీడీపీ నేత‌లు చాలా రోజుల పాటు స‌వాళ్లు , ప్ర‌తిస‌వాళ్లు విసురుకున్నారు. చివరకు టీడీపీనే ‘ప్యాకేజీ’తో సరిపెట్టుకుని హోదా వేస్ట్ అని తేల్చటంతో అసలు ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగిపోయింది. కొద్ది రోజుల వ‌ర‌కు చంద్ర‌బాబుపై ఫైర్ అయిన ఏపీ బీజేపీ నేత‌లు సైతం ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు […]

నోట్ల ఎఫెక్ట్ నిల్‌….మ‌హారాష్ట్ర‌లో బీజేపీ సూప‌ర్ విన్‌

దేశంలో రాత్రికి రాత్రి జ‌రిగిన పెద్ద నోట్ల ర‌ద్దు ప‌రిణామం త‌ర్వాత ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బందులు ప‌డ్డారు. ఏటీఎంలు, బ్యాంకుల వ‌ద్ద క్యూలైన్ల‌లో నిల‌బ‌డ‌లేక ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. మొద‌టి నాలుగు రోజులు ఈ నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని సంతోషించిన ప్ర‌జ‌లు త‌ర్వాత ఈ క‌ష్టాలు త‌మ‌ను ఇబ్బంది పెట్టేస‌రికి అవాక్క‌య్యారు. దీంతో కాంగ్రెస్ స‌హా అన్ని విప‌క్షాలూ.. పెద్ద ఎత్తున మోడీపై విరుచుకుప‌డ్డాయి. ఈ ప‌రిణామం బీజేపీ తీవ్రంగా ఇరుకున పెట్టేదేన‌ని […]

చంద్ర‌బాబు ఎర్త్‌కు బీజేపీ స్కెచ్‌లు

ఏ పొలిటిక‌ల్ పార్టీ అయినా సొంతంగా బ‌లంగా ఎదిగేందుకు ఉన్న అవ‌కాశాల‌ను పూర్తిగా వినియోగించుకుంటూనే ఉంటాయి. ఈ విష‌యంలో జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు వేటిక‌వే త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మరం చేయ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఏపీలో బీజేపీ సొంతంగా ఎదిగేందుకు, మ‌రింత బ‌లంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఇప్ప‌టికే అధికార టీడీపీతో పొత్తు పెట్టుకుని రెండు మంత్రి పీఠాల‌ను సైతం కైవసం చేసుకున్న బీజేపీ రాబోయే రోజుల్లో మాత్రం సొంతంగా ఎద‌గ‌డంపై దృష్టిపెట్టింది. ఈ క్ర‌మంలోనే […]

ఏపీలో బీజేపీ పీక నొక్కుతోందెవ‌రు..!

అవును! ఏపీలో ఎంతో ఎత్తుకు ఎద‌గాల‌ని.. క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా మాట‌ల్లో చెప్పాలంటే నేరుగా అధికారంలోకే వ‌చ్చేయాల‌ని పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్న బీజేపీకి ఇప్పుడు ఏపీలో వాయిస్ క‌ట్ అయింది!! ఇంకొంచెం ఘాటుగా చెప్పాలంటే.. బీజేపీ మ‌ర్డ‌రే అయిపోతోంది! పెద్ద నోట్ల ర‌ద్దుతో వెల్లువెత్తుతున్న ప్ర‌జా గ్ర‌హాన్ని త‌మ‌పై ప‌డ‌కుండా చూసుకునే క్ర‌మంలో తెలుగుదేశం నేత‌లు ఏకంగా బీజేపీని బోనులోకి ఎక్కించేసి.. చుట్టూ చేరి రాళ్లేస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌రి బీజేపీని కాపాడుకునేందుకు, దానిపై […]

నోట్ల ర‌ద్దు వెన‌క బీజేపీ బ్ర‌హ్మ‌చారులు

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఏ వార్తా ఛానెల్ చూసినా, ఏ పేప‌ర్ చూసినా.. ఆఖ‌రికి ఏ ఇద్ద‌రు క‌లిసినా.. నోట్ల ర‌ద్దు విష‌యమే క‌నిపిస్తోంది.. వినిపిస్తోంది! ఇక‌, నెటిజ‌న్ల తీరే వేరు క‌దా.. సోష‌ల్ మీడియాలో అయితే, కామెంట్ల‌కు, జోక్‌ల‌కు కొద‌వేలేదు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయారు యోగా గురువు రాందేవ్ బాబా. న‌ల్ల‌ధ‌నంపై పోరును ఆయ‌న స్వాగ‌తిస్తూనే కొన్ని ఆస‌క్తి క‌ర కామెంట్లు చేశారు. ప్ర‌స్తుతం […]

పాలిటిక్స్‌లోకి గాలి రీ ఎంట్రీ వెన‌క అస‌లు సీక్రెట్‌..?

త‌న కుమార్తె బ్రాహ్మ‌ణి వివాహాన్ని అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిపించి దేశ వ్యాప్త జ‌నాల దృష్టినీ ఆక‌ర్షించిన మైనింగ్ కింగ్ గాలి జ‌నార్ద‌న‌రెడ్డి.. మ‌ళ్లీ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నారా?  ఇప్ప‌టికే దీనికి సంబంధించి ప్ర‌ముఖ నేత‌ల‌తో ఆయ‌న మంత‌నాలు సాగిస్తున్నారా? త‌నపై న‌మోదైన కేసుల నుంచి బ‌య‌ట‌పడేందుకు, కొత్త‌గా ఏవీ న‌మోదు కాకుండా చూసుకునేందుకు ఆయ‌న రాజ‌కీయాలే శ‌ర‌ణ్య‌మ‌ని భావిస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. మ‌రి అదేంటో చూద్దాం. క‌ర్ణాట‌క  బీజేపీలో […]