బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ వైఫ్ బ‌స‌వ‌తార‌కంగా యంగ్ హీరోయిన్‌

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం రెండు ఎన్టీఆర్ బ‌యోపిక్‌ల సంద‌డి స్టార్ట్ అయ్యింది. ఈ రెండు బ‌యోపిక్‌లు సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవితాన్ని బేస్ చేసుకుని తెర‌కెక్కుతున్న‌వే అయినా రెండు వేటిక‌వే డిఫ‌రెంట్ క‌థాంశాల‌తో తెర‌కెక్కుతున్న‌వి. వ‌ర్మ బ‌యోపిక్ పూర్తిగా కాంట్ర‌వ‌ర్సీ స్టైల్లో తెర‌కెక్కుతోంది. ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీపార్వ‌తి ఎంట్రీ ఇవ్వ‌డం, ఎన్టీఆర్‌ను చంద్ర‌బాబు సీఎం పీఠం నుంచి దించేసి ఎక్క‌డం..ఇలా ఎన్టీఆర్ జీవితంలో చివ‌రి రోజుల‌తో వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తెర‌కెక్క‌నుంది. ఇక ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ హీరోగా – […]