మళ్ళీ జగనే..నో డౌట్.!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ జగన్ ముందస్తు ఆలోచన చేస్తే చెప్పలేం. సరే ఏదేమైనా గాని ఎన్నికల సీజన్ మొదలైంది. ఇక ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇక సర్వే సంస్థలు వాటి పనిలో అవి ఉన్నాయి. రకరకాల సర్వేలు వస్తున్నాయి. కొన్ని వైసీపీకి అనుకూలంగా..మరికొన్ని టి‌డి‌పికి అనుకూలంగా వస్తున్నాయి. అయితే వీటిల్లో జాతీయ సర్వేలు కూడా ఉంటున్నాయి. జాతీయ సర్వేలు దాదాపు వైసీపీకే అనుకూలంగా […]

జగన్ సర్కార్‌కు విద్యుత్‌ ఉద్యోగులు షాక్ ఇస్తారా…!

వేతన సవరణ విషయంలో జగన్ సర్కార్‌కు విద్యుత్ శాఖ ఉద్యోగుల షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భోజన విరామ సమయంంలో నిరసనలు చేస్తున్న ఉద్యోగులు నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడేది లేదంటున్నారు. ఏపీ విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు వేరు.. విద్యుత్ కార్పొరేషన్ల ఉద్యోగులు వేరు. వీరికి ప్రత్యేక ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వీరికి విద్యుత్ సంస్కరణల వల్ల భారీ ప్రయోజనం కలిగింది. అయితే.. జగన్ ప్రభుత్వం వచ్చాక అంతంత జీతాలు అవసరమా అన్నట్లుగా ట్రీట్ […]

ప్రాజెక్టుల బాట పట్టనున్న చంద్రబాబు…!

టీడీపీ అధినేత త్వరలో ప్రాజెక్టుల బాట పడుతున్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో మూలనపడ్డ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. వైసీపీ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించనున్నారు. సాగు, త్రాగు నీరు అందించే ప్రాజెక్ట్‌లపై జగన్ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో మూలన పడిన ప్రాజెక్ట్‌లు, ప్రభుత్వం ఆయా ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించకుండా వ్యవహరిస్తున్న తీరును.. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను చంద్రబాబు ప్రజలకు వివరించారు. మూడు […]

గంటా నియోజకవర్గం ఏదో ఫుల్ క్లారిటీ….!

గంటా శ్రీనివాసరావు… ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న రాజకీయ వేత్త. చిన్నస్థాయి నుంచి వచ్చిన గంటా… ఒక జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారనేది వాస్తవం. 1999లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన గంటా శ్రీనివాసరావు… ఇప్పటి వరకు 5 సార్లు పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతిసారి గెలవడమే గంటా ప్రత్యేకత. 1999లో తొలిసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన గంటా […]

ఆ మంత్రికి పవన్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారా….!

బ్రో… సాయి ధరమ్ తేజ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషించారు. పేరుకు హీరో సాయి ధరమ్ తేజ్ అయినప్పటికీ… సినిమా మొత్తం పవన్ కల్యాణ్ వల్లే ముందుకు సాగింది. సినిమా మొదలైన సరిగ్గా పావుగంటకు స్క్రీన్ పైకి వచ్చిన పవన్… సినిమా చివరి వరకు కనిపించారు. బ్రో సినిమాలో పవన్ సినిమాలు తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి, గుడుంబా శంకర్, జల్సా సినిమాల్లోని పాటలు పెట్టడంతో పవన్ ఫ్యాన్స్ […]

గుంటూరుపై జనసేన పట్టు..టీడీపీ ఇరుక్కునట్లే.!

రానున్న ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తుంది. ఈ రెండు పార్టీలతో బి‌జే‌పి కలిసే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. మూడు పార్టీలు కలిస్తే వైసీపీకే లాభం. ఎందుకంటే బి‌జే‌పికి ఉన్న యాంటీ..టి‌డి‌పిపై పడుతుంది. సరే ఆ విషయం పక్కన పెడితే..పొత్తులో భాగంగా ఏ ఏ సీట్లు ఏ పార్టీకి దక్కుతాయనేది పెద్ద చర్చగా మారింది. ఎలాగో టి‌డి‌పి పెద్ద పార్టీ కాబట్టి…బి‌జే‌పి-జనసేనలకు ఆ పార్టీ సీట్లు త్యాగం చేయాలి. ప్రధానంగా జనసేనకు ఎక్కువ సీట్లు వదలాలి. […]

గుడివాడలో ట్విస్ట్‌లు..రాము కాదు..రావి.!

గుడివాడలో కొడాలి నానిని ఢీకొట్టే ప్రత్యర్ధి ఎవరు? ఇది గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్ అవుతున్న అంశం. గుడివాడలో కొడాలి నానిపై పోటీ చేసే టి‌డి‌పి నేత ఎవరనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఇప్పటికే రెండుసార్లు అభ్యర్ధులని మార్చిన కొడాలిని ఓడించలేకపోయారు. ఎందుకంటే కొడాలికి గుడివాడపై పట్టు అలా ఉంది. 2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచిన కొడాలి..సొంతంగా బలం పెంచుకున్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. సొంత బలం […]

ఉమాకు మళ్ళీ ఎదురుదెబ్బ..సొంత వాళ్ళే.!

ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో దేవినేని ఉమా తిరుగులేని నాయకుడుగా ఉండేవారు. కృష్ణా టి‌డిపిలో ఈయన హవా ఎక్కువ ఉండేది. ఇక ఈయన ఏది చెబితే అదే అన్నట్లు నడిచేది. అలా ఉమా హవా నడిచేది..అలాంటిది ఇప్పుడు ఆయన పరిస్తితి దారుణంగా తయారైంది. చిన్న నాయకుడు కూడా ఆయన్ని లెక్క చేయడం లేదు. ఇక టి‌డి‌పి అధిష్టానం వద్ద ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. ఒక్క ఓటమి ఆయన్ని పాతాళానికి తీసుకెళ్లింది. వరుసగా నాలుగుసార్లు […]

ముద్రగడ రెడీ..మంత్రితో భేటీ..సీటుపై చర్చ.!

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..దాదాపు వైసీపీలో చేరిక ఖాయమైందనే చెప్పాలి. తాజాగా ఆయన మంత్రి గుడివాడ అమర్నాథ్ తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక విషయంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ కాపు రిజర్వేషన్లు కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. అలాగే అప్పుడు బాబు ప్రభుత్వం..ముద్రగడని గట్టిగానే టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ముద్రగడ పోరాటం చేయడం ఆపేశారు. సైలెంట్ గానే ఉంటున్నారు. కానీ […]