పాతపట్నం సీటు ఎవరికి? సీనియర్ వర్సెస్ జూనియర్.!

తెలుగుదేశం పార్టీ వేగంగా పుంజుకుంటున్న సీట్లలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం కూడా ఒకటి. ఇటీవల సర్వేల్లో ఇక్కడ టి‌డి‌పికి ఆధిక్యం ఉందని తేల్చి చెప్పాయి. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వరుసగా వైసీపీ గెలుస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి రెడ్డి శాంతి విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా అతి త్వరగా ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్నారు. అటు తన వారసుడు ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. అటు వంశధార నిర్వాసితులకు న్యాయం జరగలేదు. అభివృద్ధి జరగడం లేదు.

ఈ పరిణామాలు పాతపట్నంలో వైసీపీని నెగిటివ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో అక్కడ టి‌డి‌పి బలపడుతుంది. కాకపోతే టి‌డి‌పిలో ఒక సమస్య ఉంది. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సీనియర్ నేత కలమట వెంకటరమణ, యువనేత మామిడి గోవిందరావుల మధ్య సీటు అంశంపై రచ్చ నడుస్తోంది. అయితే ఇంచార్జ్ గా వెంకటరమణ దూకుడుగానే అంటున్నారు. ఈయనకు పోటీగా మామిడి పనిచేస్తున్నారు. ఇలా ఇద్దరు నేతల మధ్య సీటు పంచాయితీ నడుస్తోంది.

ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబు పాతపట్నం కొత్తూరులో భారీ సభ నిర్వహించారు. ఈ సభలో ఇంచార్జ్ కలమట..బాబు పక్కనే ఉన్నారు. దీని బట్టి చూస్తే ఆ సీటు కలమటకే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన పనితీరు గాని బాగోకపోతే మార్చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అలాంటి పరిస్తితి కనిపించడం లేదు. కలమట పనితీరు బాగానే ఉంది కాబట్టి..ఆయనకే సీటు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అలాగే గెలుపు అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి.