హెబ్బా అందాల‌కు అబ్బా అంటున్న కుర్రాళ్లు.. ఇంత‌లా రెచ్చిపోతే ఎలా త‌ల్లీ!?

అందం, అంత‌కుమించి టాలెంట్ ఉన్నా కూడా స‌రైన ఆఫ‌ర్లు లేక స‌త‌మ‌తం అవుతున్న హీరోయిన్ల జాబితాలో హెబ్బా ప‌టేల్ ఒక‌టి. `కుమారి 21ఎఫ్` మూవీతో టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసింది. కానీ, ఆ స్థాయిలో హిట్ కొట్ట‌లేక‌పోయింది. పైగా కెరీర్ ఆరంభంలోనే చాలా బోల్డ్ గా న‌టించ‌డం వ‌ల్ల‌.. స్టార్ హీరోలు ఆమె వొంక చూడ‌లేదు.

క‌నీసం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. రామ్ రెడ్ మూవీలో ఐటెం భామ‌గా కూడా అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కానీ, పెద్ద‌గా క్లిక్ కాలేదు. ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తూ.. కెరీర్ ను లాక్కొస్తోంది. ఇక సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో మాత్రం హెబ్బా చాలా యాక్టివ్ గా ఉంటుంది. త‌ర‌చూ స్ట‌న్నింగ్ ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారు గుండెల్లో మంట‌లు రేపుతుంటుంది.

తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో కుర్రాళ్ల చేత అబ్బా అనిపించింది. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్ లో స్కిన్ షోతో రెచ్చిపోయింది. చూపించ‌కూడ‌న‌వే చూపిస్తూ హాట్ హాట్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. హెబ్బా ప‌టేల్ తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Hebah P (@ihebahp)