టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మొదట తరుణ్ నటించిన ప్రియమైన నీకు సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే హనుమాన్ జంక్షన్, సంక్రాంతి ,శ్రీరామదాసు, వెంకీ తదితర చిత్రాలను నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా సక్సెస్ అయిన హీరోయిన్లలో స్నేహ కూడా ఒకరు దాదాపుగా చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది స్నేహ.
అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించిన ఈమె ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా నటిగా తనకంటూ మంచి పాపులారిటీ అందుకుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉన్నది.అయితే తాజాగా జిమ్ వర్కౌట్ చేస్తూ ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా స్లిమ్ గా తయారయ్యేందుకు జిమ్ వర్కౌట్లు చేస్తూ ఉంటారు.
అలా స్నేహ కూడా ఒక జిమ్ వర్కౌట్ చేస్తూ వీడియోని షేర్ చేసింది. ఇందులో బరువును లిఫ్ట్ చేస్తూ కష్టపడుతూ ఉందని పలువురు నెటిజన్లు ఆమె పైన సెటైర్లు వేస్తూ ఉన్నారు. దీంతో పలువురు నెటిజన్లు ఇలాంటి బరువులు ఎత్తబడటం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటూ స్నేహాన్ని హెచ్చరిస్తున్నారు. దీనికి బదులుగా యోగ చేయండి అంటూ కూడా ఉచిత సలహాలు ఇవ్వడం జరుగుతోంది. రీఎంట్రీలో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలో నటించాక ఆ తరువాత మరో సినిమాలో కూడా నటించలేదు.
View this post on Instagram