అమ్మకు అగ్నిపరీక్ష.. ఏం చేస్తారో చూడాలి మరి….!

ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ షర్మిళ కొత్త అధ్యక్షురాలుగా రాబోతున్నారా..? పత్రికలో వచ్చిన కథనం మేరకు ఇదే జరగబోతోంది. అయితే ఇది జరిగే పనేనా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పాలు-నీళ్లలా ఉన్న జగన్‌-షర్మిళలు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిన మాట వాస్తవమే. కానీ ఆమె నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే.. తెలంగాణలో పార్టీ పెట్టారు. కానీ ఇప్పుడు కొన్ని పరిణామాలు జరిగాయి… పరిస్థితులు మారాయని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో […]

మంగళగిరి టూ మంగళగిరి.. ఊహించని మార్పు..!

పాదయాత్ర ఓ నాయకుడిలో ఇంత మార్పు తెస్తుందా..? గతానికి భిన్నంగా మనిషిని పూర్తిగా మార్చేస్తుందా..? నాయకత్వ లక్షణాలను అబ్బేలా చేస్తుందా..? నారా లోకేష్‌ పాదయాత్ర జరిగిన తీరు.. ఆయనకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. సరిగ్గా 188 రోజుల క్రితం లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 2500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మంగళగిరి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో పర్యటనలు.. గడప గడపకు కార్యక్రమాలు ముగించుకుని పాదయాత్రకు వెళ్లిన లోకేష్‌ మళ్లీ 185 రోజుల తర్వాత […]

ఇదేం ఘోరం గోవిందా..?

అవును పాపం భూమన అనాల్సిందే. ఏ మూహుర్తంలో రెండోసారి టీటీడీ ఛైర్మన్‌ పదవి ఫిక్స్‌ అయిందో కానీ.. ఆ సమయం ఆయనకు అంతగా కలిసి వచ్చినట్టు లేదు. తిరుమల కొండపై చిరుత ఓ చిన్నారిని చంపేయడమనే హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. సంఘటన చాలా బాధాకరం. అయితే ఆ తర్వాత జరిగిన ఘటనలు.. తీసుకున్న నిర్ణయాలు.. చేసిన కామెంట్లు ఇప్పుడు భూమనను ట్రోల్స్‌కు గురి చేయడంతో పాటు.. మొత్తంగా ప్రభుత్వాన్నే డామేజ్‌ చేస్తున్నాయి. చిన్నారిని చిరుత చంపేసిన […]

నా త‌మ్ముడిని వైసీపీ ఎమ్మెల్యేగా గెలిపించండి… మంచు విష్ణు సంచ‌ల‌న కామెంట్స్‌

మంచు విష్ణు కలెక్షన్ కింగ్‌ మోహన్ బాబు సినీవారసుడు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి సినిమాల్లో నటిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం భక్త కన్నప్ప సినిమాల్లో బిజీగా ఉన్న మంచు విష్ణు ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంట‌ర్వ్యులో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్నీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. పవన్ రాజకీయాల గురించి చెప్పడానికి నేనేమైనా బ్రహ్మం గారి నా..?అంటూ విష్ణు క‌మెంట్ చేశాడు. ఆయన సినిమాల గురించి అడిగితే నేను […]

కృష్ణాలో లోకేష్ మూడు రోజులే..స్పెషల్ టార్గెట్ వంశీ.!

లోకేష్ యువగళం పాదయాత్ర అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో కాస్త ప్రజాదరణ ఉంటుంటే..కొన్ని చోట్ల ప్రజాదరణ ఉండటం లేదు. ఇక అలా అలా రాయలసీమ నుంచి కోస్తా వరకు లోకేష్ పాదయాత్ర వచ్చింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో పాదయాత్ర కొనసాగుతుంది. ఇక్కడ అయిదురోజుల పాటు లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసి లోకేష్ ఓడిపోయారు. మళ్ళీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి రెడీ […]

విశాఖలో ఎవరి బలమెంత? ఆధిక్యం ఎటువైపు?

అతి త్వరలో జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. దసరా నాటికి జగన్ విశాఖలో కాపురం పెడతానని చెప్పారు. అప్పటినుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుంది. అంటే విశాఖ పరిపాలన రాజధాని కాబోతుంది. దీంతో విశాఖపై వైసీపీకి రాజకీయంగా కూడా పట్టు దొరుకుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటేసింది. ఇప్పటివరకు ఆ దిశగా పనులు జరగలేదు. ఇప్పుడు […]

కంచుకోటలో టీడీపీ వెనుకడుగు..వైసీపీకి చిక్కినట్లేనా?

అది టి‌డి‌పి కంచుకోట…వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టింది..అయితే నాలుగో సారి గెలవడంపై అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే టి‌డి‌పి కంచుకోటపై వైసీపీ పట్టు సాధిస్తుంది. దీంతో టి‌డి‌పి బలం తగ్గుతుంది. ఇక టి‌డి‌పి బలం తగ్గడానికి ఉదాహరణగా తాజాగా చంద్రబాబు పర్యటనలో పెద్దగా జనం లేకపోవడం..దీంతో ఆ కంచుకోటలో టి‌డి‌పికి భారీ దెబ్బ తగిలేలా ఉంది. అలా టి‌డి‌పి వెనుకడుగు వేసిన కంచుకోట ఏదో కాదు..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట స్థానం. గత మూడు […]

కమ్యూనిస్టులతో కలిసే..కేసీఆర్ ప్లాన్ ఇదే.!

మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే అభ్యర్ధుల ఎంపికపై కే‌సి‌ఆర్ కసరత్తు చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఎండింగ్‌కు వచ్చిందని తెలిసింది. దాదాపు సిట్టింగులకే సీట్లు ఫిక్స్ అవుతున్నాయని తెలిసింది. ఇక బాగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలక్ సీటు ఇవ్వకూడదని కే‌సి‌ఆర్ డిసైడ్ అయ్యారు. ఇక వారు జంప్ అవ్వకుండా..అధికారంలోకి వస్తే వేరే పదవులు ఇస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలిసింది. అటు కాంగ్రెస్ […]

జగన్ యాంటీ పోగొడుతున్న బాబు-పవన్.!

ఏపీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా అత్యంత ప్రజాదరణతో 2019 ఎన్నికల్లో జగన్ సి‌ఎం అయిన విషయం తెలిసిందే. ఆయనకు ఊహించని మద్ధతు లభించింది. ఇక అదే ప్రజాదరణ ఇప్పటికీ ఉందా? అంటే కాస్త లేదనే చెప్పాలి. అలా అని రాష్ట్రంలో ఆధిక్యం ఆయనదే. కాకపోతే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత రావడం, క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల టి‌డి‌పి బలపడటంతో వైసీపీ బలం కాస్త తగ్గింది..గాని ఓవరాల్ గా లీడ్ లోనే ఉన్నారు. అయితే వైసీపీకి […]