“నన్ను ఏం పీకలేరు ‘బ్రో'”.. కరెక్ట్ టైంలో కొట్టిన పవన్ కళ్యాణ్ ..!!

ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తున్నాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో.. అప్పటినుంచి ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతూ వస్తున్నాయి. కాగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులు ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు ఆఫీసర్లు . అంతేకాదు ఆయనను రాజమండ్రిలోని మహేంద్రవరం జైల్లో ఉంచారు. కాగా ఈ క్రమంలోని ఆయనను రీసెంట్గా మీటైనా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ టిడిపి జనసేన 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతుంది అంటూ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇన్నాళ్లు టిడిపి తో జనసేన చేతులు కలుపుతుందా..? లేదా..? అంటూ కొంచెం డౌట్ లో ఉన్న ఫాన్స్ కూడా ఇప్పుడు ఫుల్ క్లారిటీకి వచ్చేసారు.

అయితే అధికార పార్టీ మాత్రం మొదటి నుంచి ఈ స్ట్రాటజీని అంచనా వేసింది . కచ్చితంగా ఎలక్షన్స్ లో టిడిపి – జనసేన కలిసి పార్టిసిపేట్ చేయబోతుంది అంటూ ముందే పసిగట్టిన వైసిపి ..దానికి తగ్గ స్ట్రాటజీలను బ్యాగ్రౌండ్ లో వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు ద్వారా తెలుస్తుంది . అయితే ఇలాంటి క్రమంలోని రీసెంట్ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టిడిపి – జనసేన కన్నా ఓ పార్టీ పేరును మాత్రం పదేపదే నొక్కి పెట్టి మాట్లాడారు .. అదే బిజేపి . పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో మనం ఎక్కువగా విన్నపదం బిజేపి . పరోక్షంగా ఆయన బిజెపి మాకు సపోర్ట్ చేస్తుంది అంటూ హింట్ ఇచ్చారు.

అయితే మరోపక్క బీజేపీ సపోర్ట్ చేయకపోతే ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదేమో అన్న భయం కూడా ఆయనలో కనిపించింది. అందుకే కాబోలు ఆయన పదేపదే బిజెపి మాకు సపోర్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం.. మా వెంట ఉంటుందని భావిస్తున్నాం.. జగన్ గురించి మేము ఆయనకి ప్రత్యేకంగా చెప్పాలా ..? ఆయన చేసే అరాచకాల గురించి మోడీకి తెలియదా..? అంటూ పరోక్షకంగా మోడీ మాకు సపోర్ట్ చేయాల్సిందే అన్న రేంజ్ లో కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ .

ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాటల ద్వారా ఓ విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది. బిజేపి సపోర్ట్ చేస్తే మమ్మల్ని ఎవ్వడు ఏం పీకలేరు అన్న రేంజ్ లో టిడిపి – జనసేన ఫిక్స్ అయిపోయింది అన్న భావన ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు పలువురు జనసేన పార్టీ నేతలు .. శ్రేణులు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. కచ్చితంగా ఈసారి ఏపి పాలిటిక్స్ కి బిజెపి సపోర్ట్ చేస్తే ..బీజేపీ – టిడిపి – జనసేన కలిస్తే.. మమ్మల్ని ఎవ్వడు ఏం పీకలేరు బ్రో అంటూ స్ట్రైట్ ఫార్వార్డ్ గా చెప్పుకొస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతుందో ..? అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది చూద్దాం . మరి రానున్న రోజుల్లో రాజకీయాలలో ఏం జరగబోతుందో చూద్దాం..!!