చంద్రబాబు అరెస్ట్…. హాట్ టాపిక్ గా మారిన నందమూరి ఫ్యామిలీ….!!

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో రకాల పరిణామాలను రెండు రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు అరెస్ట్ పై జనంలో తీవ్రంగా వ్యతిరేకత కనిపిస్తుంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ సైతం నిరసన తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నాయకుడి అరెస్టుపై ఎంతోమంది ప్రముఖులు కూడా స్పందించారు.

ఇక స్టార్ హీరోలు స్వయంగా చంద్రబాబుకు మేనల్లుళ్లు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఈ విషయంపై ఎటువంటి స్పందన లేదు. అసలేం జరిగినా మాకు సంబంధం లేనట్లుగా ఈ హీరోలు ఇద్దరూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కాం జరిగిందంటూ సిఐడి చంద్రబాబును 14 రోజులు రిమాండ్ లో పెట్టిన సంగతి తెలిసిందే.

సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కొందరు రియాక్ట్ అయ్యారు. టాలీవుడ్ డైరెక్టర్స్ కొందరు చంద్రబాబు అరెస్ట్‌ని ఖండిస్తూ డైరెక్ట్ గానో, ఇన్ డైరెక్ట్ గానో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఈ విషయంపై ఏమి స్పందించకపోవడంతో ప్రస్తుతం ఈ నందమూరి హీరోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు.