బాలీవుడ్ సినిమాని ఓకే చేసింది అందుకే..? అందరి నోర్లు మూయించిన సాయి పల్లవి..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సాయిపల్లవి నటనకు ఇంపార్టెన్స్ ఇచ్చే పాత్రలే చేస్తుంది అన్న నమ్మకం అందరికీ ఉంది . అయితే నిన్న మొన్నటి వరకు తెలుగు – తమిళం – మలయాళం లో సినిమాలు చేసే సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న ప్రచారం ఊపందుకుంది. అమీర్ ఖాన్ కొడుకు జినత్ ఖాన్ సినిమాలో సాయి పల్లవి నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే సాధారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే చాలా బోల్డ్ గా చూస్తారు జనాలు . ఆ ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వాలి అన్నా..? హీరోయిన్గా వెళ్లాలి అన్నా..? ఖచ్చితంగా చిట్టిపొట్టి బట్టలు బికినీలు వేసుకోవాల్సిందే . మరి పయట జారితేనే కస్సుబుస్సులాడే సాయి పల్లవి .. అక్కడికి వెళ్లి బికినీలు వేస్తుందా..? అన్నది సాయి పల్లవి అభిమానుల సందేహం.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ఏ ఇండస్ట్రీలోనైనా నటన ఉంటే రెస్పెక్ట్ ఇస్తారు ..నటన ఉంటే ఎంకరేజ్ చేస్తారు.. అని ప్రూవ్ చేయడానికి సాయి పల్లవి బాలీవుడ్ సినిమాను యాక్సెప్ట్ చేసిందని .. త్వరలోనే అదే ప్రూవ్ చేసి చూపించబోతుందని .. ఎవరైతే తనను హద్దులు మీరు మాట్లాడి కామెంట్స్ చేశారో.. వాళ్ల నోరులు మూయించే పని చేయబోతుంది సాయి పల్లవి అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . దీంతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ న్యూస్ వైరల్ గా మారింది..!!