లోకేశ్ పాదయాత్రలో భారీ మార్పులు… ఎందుకనీ…!?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మొదలైన యువగళం పాదయాత్ర… 6 జిల్లాలు పూర్తి చేసుకుని 7వ జిల్లాలో కొనసాగుతోంది. అయితే అనూహ్యంగా పాదయాత్ర రూట్ మ్యాప్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వరకు ఒకలా సాగిన పాదయాత్ర… ప్రకాశం జిల్లా నుంచి మారినట్లుగా తెలుస్తోంది. చిత్తూరు, అనంతపురం, […]

కొత్తపేటపై లొల్లి..జనసేనకు టీడీపీ షాక్.!

అటు టీడీపీకి, ఇటు జనసేనకు బలం ఉండి..వైసీపీ సిట్టింగ్ సీటుగా ఉన్న కొత్తపేటలో రాజకీయం ఇప్పుడు వాడివేడిగా సాగుతుంది. ఇటీవలే ఇక్కడ పవన్ పర్యటించి వెళ్లారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పర్యటించారు. ఇద్దరు నేతలు వైసీపీనే టార్గెట్ చేశారు. చంద్రబాబు కొత్తపేటలో వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇసుకలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఇసుక ర్యాంప్‌ల వద్ద సెల్ఫీలు కూడా దిగారు. ఇక రావులపాలెం సెంటర్ లో భారీ సభ ఏర్పాటు చేశారు.అయితే అంతా బాగానే ఉంది. కానీ […]

కృష్ణాపై సజ్జల గురి..అభ్యర్ధులు ఫిక్స్.!

టీడీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫోకస్ చేశారు. ఇక్కడ మళ్ళీ వైసీపీ హవా నడిచేలా స్కెచ్ వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పిని చిత్తు చేసి 16 సీట్లకు వైసీపీ 14 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కృష్ణాలో టి‌డి‌పికి చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. ఇదే క్రమంలో మళ్ళీ బలమైన అభ్యర్ధులని బరిలో దింపడానికి కృషి చేస్తున్నారు. ఇక కృష్ణాపై సజ్జల స్పెషల్ గా ఫోకస్ […]

గులాబీ ‘అభ్యర్ధులు’ రెడీ..ఆ సిట్టింగులకే నో ఛాన్స్.!

మరో మూడు రోజుల్లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల లిస్ట్ రానుంది. ఈ నెల 21న సి‌ఎం కే‌సి‌ఆర్..తమ పార్టీ అభ్యర్ధుల మొదట లిస్ట్ విడుదల చేయనున్నారు. దాదాపు 87 మందితో మొదట లిస్ట్ విడుదల చేస్తారని తెలిసింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కే‌సి‌ఆర్ సీట్లు ఇవ్వడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 10 లోపే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 కాంగ్రెస్, 7 ఎం‌ఐ‌ఎం, 3 […]

లోకేష్‌కు కేశినేని హ్యాండ్..బెజవాడలో టీడీపీకి ఎదురుదెబ్బ?

మరో రోజులో విజయవాడలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ కానున్న విషయం తెలిసిందే. మంగళగిరిలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..19వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఎంట్రీ ఇస్తారు. మొదట విజయవాడ వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. 20వ తేదీన విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లోకి వెళ్తారు. 21వ తేదీన గన్నవరంలో పాదయాత్ర చేసి..అక్కడే భారీ సభ ఏర్పాటు చేస్తారు. 22న హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడుకి వెళ్ళి..అటు నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడిలోకి ఎంట్రీ ఇస్తారు. […]

బాబుకు జనాదరణ కరువు..అక్కడ నుంచే డౌట్.!

బాదుడే బాదుడు అంటూ గత రెండేళ్ల క్రితం..జగన్ సర్కార్ పన్నుల బాదుడుపై టి‌డి‌పి అధినేత చంద్రబాబు పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టి‌డి‌పి నేతలని జనంలోకి పంపారు. ఏ విధంగా ప్రభుత్వం పన్నుల బాదుడుకు దిగిందో ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేశారు. ఇక చంద్రబాబు సైతం ప్రజల్లో తిరిగారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో పెద్ద ఎత్తున ప్రజా స్పందన వచ్చింది. ఈ స్పందన ఎవరూ ఊహించలేదు. […]

అమ్మకు అగ్నిపరీక్ష.. ఏం చేస్తారో చూడాలి మరి….!

ఏపీ కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్‌ షర్మిళ కొత్త అధ్యక్షురాలుగా రాబోతున్నారా..? పత్రికలో వచ్చిన కథనం మేరకు ఇదే జరగబోతోంది. అయితే ఇది జరిగే పనేనా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పాలు-నీళ్లలా ఉన్న జగన్‌-షర్మిళలు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిన మాట వాస్తవమే. కానీ ఆమె నేరుగా తన అన్నతో ఢీకొనడానికి ఇష్టం లేకే.. తెలంగాణలో పార్టీ పెట్టారు. కానీ ఇప్పుడు కొన్ని పరిణామాలు జరిగాయి… పరిస్థితులు మారాయని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో […]

మంగళగిరి టూ మంగళగిరి.. ఊహించని మార్పు..!

పాదయాత్ర ఓ నాయకుడిలో ఇంత మార్పు తెస్తుందా..? గతానికి భిన్నంగా మనిషిని పూర్తిగా మార్చేస్తుందా..? నాయకత్వ లక్షణాలను అబ్బేలా చేస్తుందా..? నారా లోకేష్‌ పాదయాత్ర జరిగిన తీరు.. ఆయనకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. సరిగ్గా 188 రోజుల క్రితం లోకేష్‌ పాదయాత్ర ప్రారంభించారు. సుమారు 2500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మంగళగిరి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో పర్యటనలు.. గడప గడపకు కార్యక్రమాలు ముగించుకుని పాదయాత్రకు వెళ్లిన లోకేష్‌ మళ్లీ 185 రోజుల తర్వాత […]

ఇదేం ఘోరం గోవిందా..?

అవును పాపం భూమన అనాల్సిందే. ఏ మూహుర్తంలో రెండోసారి టీటీడీ ఛైర్మన్‌ పదవి ఫిక్స్‌ అయిందో కానీ.. ఆ సమయం ఆయనకు అంతగా కలిసి వచ్చినట్టు లేదు. తిరుమల కొండపై చిరుత ఓ చిన్నారిని చంపేయడమనే హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. సంఘటన చాలా బాధాకరం. అయితే ఆ తర్వాత జరిగిన ఘటనలు.. తీసుకున్న నిర్ణయాలు.. చేసిన కామెంట్లు ఇప్పుడు భూమనను ట్రోల్స్‌కు గురి చేయడంతో పాటు.. మొత్తంగా ప్రభుత్వాన్నే డామేజ్‌ చేస్తున్నాయి. చిన్నారిని చిరుత చంపేసిన […]