పవన్‌తో ఆ వర్గం కలిసొస్తుందా? టీడీపీకి మైనస్.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువకాలం రెండు వర్గాలే పాలించాయనే చెప్పాలి. మధ్యలో ఇతర వర్గాల వారు సి‌ఎంలుగా పనిచేశారు. కానీ ఎక్కువకాలం కమ్మ, రెడ్డి నేతలదే అధికారం. ఇక ఇంతవరకు కాపు వర్గానికి పాలించే ఛాన్స్ దక్కలేదు. ఇతర నాయకత్వాల కింద కాపు నేతలు పనిచేశారు తప్ప..సొంతంగా అధికారంలోకి రాలేదు. ఇక చిరంజీవితో అధికారం దక్కుతుందని రాష్ట్రంలోని కాపు వర్గం భావించింది. కానీ అది విఫలమైంది.

తర్వాత పవన్ పార్టీ పెట్టారు..2014లో టి‌డి‌పికి మద్ధతు ఇచ్చారు. 2019లో ఒంటరిగా పోటీ చేసి విఫలమయ్యారు. కానీ 2024 ఎన్నికల్లో పవన్ సత్తా చాటి అధికారం సొంతం చేసుకుంటారని కాపు వర్గం భావించింది. పైగా మునపెన్నడూ లేని విధంగా కాపు వర్గం పవన్ వెనుక నడుస్తోంది. దీంతో ఈ సారి అధికారం కాపుల చేతికి వస్తుందని భావించారు. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లుగా ఉన్న కాపులకు అధికారం ఖాయమని అనుకున్నారు. ఎలాగోలా పవన్ సి‌ఎం అవుతారని భావించారు.

కానీ తాజాగా పవన్ తీసుకున్న నిర్ణయంతో కాపుల ఆశలు అడియాసలు అయ్యాయి. టి‌డి‌పితో పొత్తు ఉంటుందని ప్రకటించడంతో సీన్ రివర్స్ అయింది. టి‌డి‌పి ఎలాగో పెద్ద పార్టీ. పైగా మెజారిటీ సీట్లు ఆ పార్టీకే ఉంటాయి. ఇక సి‌ఎం పదవి విషయంలో చర్చ లేదు. చంద్రబాబు ఉండగా, పవన్‌కు సి‌ఎం పదవి దక్కే అవకాశం లేదు.

అయితే తాను రియాలిటీ ఆలోచించి పొత్తుకు మొగ్గు చూపానని పవన్ అంటున్నారు. జనసేన ఒంటరిగా వెళితే గెలవడం దాదాపు అసాధ్యం పైగా ఓట్లు చీల్చి వైసీపీకి ప్లస్ చేసినట్లు అవుతుంది. అందుకే టి‌డి‌పితో పొత్తు అంటున్నారు. కానీ కాపులు ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. పవన్ టి‌డి‌పితో కలిసిన..వారు వన్‌సైడ్ గా టి‌డి‌పికి ఓట్లు వేయడం కష్టం. జనసేన అభ్యర్ధులు ఉన్నచోట్ల ఓట్లు వేయవచ్చు..కానీ టి‌డి‌పి అభ్యర్ధులు నిలబడిన చోట కాపులు ఓట్లు వేయడం కష్టమే.