పవర్ స్టార్ గబ్బర్ సింగ్ మూవీ కి ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్‌ బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనదైన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినీ కెరీర్ లోనే అతి తక్కువ సినిమాల్లో నటించినా తన క్రేజ్ ను మాత్రం రోజురోజుకి పెంచుకుంటూ పోతున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన సినిమాలలో గబ్బర్ సింగ్ ఒకటి.

హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాతో వ‌రుస ఫ్లాపుల‌తోసతమతం అవుతున్న పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌కు ఓ సాలిడ్ త్రో బ్యాక్ మూవీ వ‌చ్చింది. ఈ సినిమా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాకు రీమేక్. ఒరిజినల్ మూవీ స్టోరీ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి పవన్ కళ్యాణ్ ఇమేజెస్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడు హరీష్ శంకర్. 2012 మే 11న రిలీజ్ అయిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ పాస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాకుండా మరో హీరో చేసి ఉంటే ఇంత స‌క్స‌స్ వ‌చ్చేది కాదు.

కానీ ముందుగా గబ్బర్ సింగ్ కథను పవన్ కళ్యాణ్ కోసం రాసుకోలేదట హరీష్ శంకర్. మాస్ మహారాజ్ రవితేజ కోసమే రూపొందించాడట. రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో షాక్, మిరపకాయ లాంటి హిట్ సినిమాలు ఉన్నాయి. దేనితో రవితేజ కూడా ఈ మూవీ చేయాలని అనుకున్నాడు. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా రూపొందించి హిట్ కొట్టాడు హరీష్ శంకర్.