అలాంటి టైంలో ప్రభాస్ ఓదార్పునిచ్చాడు.. జగపతిబాబు..

జగపతిబాబు ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా వరుస హిట్ సినిమాల నటిస్తూ మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు మాట్లాడుతూ ప్రభాస్ పై రాజమౌళి ఫ్యామిలీ పై ప్రశంసల వర్షం కురిపించాడు. రాజమౌళి కుటుంబాన్ని చూసి 20% నేర్చుకున్న చాలని.. అంత గొప్ప ఘనత సాధించిన సరే ఆ కుటుంబంలో ఎవరికి ఇసుమంత గర్వం కూడా ఉండదు.. ఒకరిద్దరు కాదు ఫ్యామిలీ మొత్తం అలానే ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ప్రభాస్ కూడా అదే తరహా మనిషని ఎంత ఎదిగిన కాస్త గర్వం కూడా ఉండదంటూ వివరించాడు. ఎవరు సహాయం అడిగినా చేయడమే కానీ ఒకరి దగ్గర తీసుకోవడం ప్రభాస్‌కి రాదని నాకు అతని విషయంలో వ్యక్తిగతమైన అనుభవం ఉందని చెప్పుకొచ్చాడు. నేను ఓ సారి డిప్రెషన్ లోకి వెళ్లానని వివరించిన జగపతిబాబు ఆ సమయంలో ప్రభాస్ కు ఫోన్ చేసి మాట్లాడాల‌ని అడిగానని.. తన జార్జియాలో ఉన్నాడ‌ని.. డార్లింగ్ నేనున్నాను కదా నీ ప్రాబ్లం ఏంటో చెప్పు.. నేను చూసుకుంటా అని ధైర్యం చెప్పాడని.. అంతేకాదు అక్కడి నుంచి వచ్చాక నన్ను కలిసాడ‌ని వివ‌రించాడు.

త‌న కంటే చిన్నవాడైనా ఎంతో గొప్ప హృదయం ఉన్న వ్యక్తి ప్రభాస్ ఆ చిన్న ఓదార్పు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది అంటూ ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడం పై స్పందించిన జగపతిబాబు మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం అల్లు అర్జున్ చూసినప్పుడే తనలో నాకు పట్టుదల కనిపించిందని.. అతనికి సినిమాలపై ఎంతో తపన ఉందని వివరించాడు. తనను చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని జగపతిబాబు అన్నాడు. ఇక తాజాగా రుద్రాంగి సినిమాతో పలకరించిన జగపతిబాబు.. ప్రస్తుతం స‌లార్‌, గుంటూరు కారం, పుష్ప 2 సినిమాల్లో నటిస్తున్నాడు.