వెండితెరపై స్టార్ హీరోయిన్ బయోపిక్..!!

గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ , రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్ లు వచ్చి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగా.. మరొకవైపు దక్షిణాదిన బయోపిక్ సినిమాలకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. మహానటి సినిమా తర్వాత బయోపిక్ మూవీల సంఖ్య భారీగా పెరిగిపోగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దివంగత నటి ఆర్తి అగర్వాల్ బయోపిక్ త్వరలోనే తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

వెంకటేష్ హీరోగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో కూడా నటించి మెప్పించింది. అంతేకాదు కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ తో కూడా ఈమె సినిమాలు చేసి పేరు దక్కించుకోవడం గమనార్హం. ఇకపోతే ఇండస్ట్రీలో ఎంత వేగంగా అయితే టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుందో.. అంతే వేగంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.ఈమె చేసింది కొన్ని సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రలతో ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఈమె ఒక యంగ్ హీరోతో ప్రేమ, బ్రేకప్ అంటూ మానసికంగా కృంగిపోయింది.

ఆ తర్వాత ఇంకొకరిని వివాహం చేసుకున్నా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండలేకపోయింది. ఆ తర్వాత సినిమాలకు దూరం అవడం, బరువు పెరిగిపోవడం, లైపోసెక్షన్ ఆపరేషన్ కూడా చేయించుకోవడం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆమెను ఇబ్బంది పెట్టాయి. చివరికి ఆరోగ్యం క్షీణించడంతో ఆమె మృత్యువాత పడ్డారు. ఇక ఈ నేపథ్యంలోని ఆమె బయోపిక్ తెరకెక్కించడానికి ఒక యంగ్ డైరెక్టర్ ఇప్పటికే కథ సిద్ధం చేయగా మరో డైరెక్టర్ తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట. ఇక త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.