గోదావరి జిల్లాల్లో వైసీపీకి ప్లస్ చేస్తున్నారా?

టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీ మొదట నష్టపోయేది గోదావరి జిల్లాల్లోనే. ఇది కొందరు విశ్లేషకులు అంచనా. కానీ పొత్తు కరెక్ట్ గా సెట్ అయితేనే వైసీపీకి నష్టం. లేదంటే వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి బాగా ప్లస్ అయింది. వైసీపీ 151 సీట్లు గెలిచింది..అందులో 50 సీట్లు కేవలం టి‌డి‌పి-జనసేన మధ్య ఓట్ల చీలిక వల్లే గెలిచింది.

అయితే ఈ సారి అలాంటి పరిస్తితి ఉండకూడదని, వైసీపీని ఓడించాలని పవన్..టి‌డి‌పితో పొత్తు పెట్టుకున్నారు. మరి పొత్తు ఉంటే వైసీపీకి ఉమ్మడి విశాఖ, తూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నష్టం తప్పదు. ఎక్కువగా గోదావరి జిల్లాల్లో వైసీపీ నష్టపోతుంది. రెండు జిల్లాలు కలిపి 34 సీట్లు ఉంటే. గత ఎన్నికల్లో వైసీపీ 27, టి‌డి‌పి 6, జనసేన 1 సీటు గెలుచుకుంది. ఇక వైసీపీ గెలిచిన 27 సీట్లలో దాదాపు 17 సీట్లు టి‌డి‌పి-జనసేన మధ్య ఓట్లు చీలడం వల్లే వైసీపీ గెలిచింది.

కానీ ఇప్పుడు టి‌డి‌పి-జనసేన కలిశాయి. దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీ 10 సీట్లు కూడా గెలుచుకోవడం కష్టమే అంటున్నారు. నిజమే పొత్తు కరెక్ట్ గా ఉంటే వైసీపీకి 10 కూడా రావు. కానీ పొత్తు సక్సెస్ అయ్యేలా లేదు. టి‌డి‌పి-జనసేనల మధ్య ఓట్లు బదిలీ సక్రమంగా జరిగేలా లేదు. ఇప్పటికే సీట్ల పంచాయితీ ఉంది. దీంతో టి‌డి‌పి అభ్యర్ధులు ఉన్నచోట జనసేన ఓట్లు పూర్తిగా పడే ఛాన్స్ లేదు. అలాగే జనసేన అభ్యర్ధులు ఉన్నచోట టి‌డి‌పి ఓట్లు పూర్తిగా పడవు. దీంతో వైసీపీకి లాభం. కాబట్టి గోదావరి జిల్లాల్లో వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదు.