కోలీవుడ్ హీరో సంచలన నిర్ణయం..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉదయనిధి రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో బిజీ బిజీగా గడిపారు. ఇప్పుడు రాజకీయంలో లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు ఉదయనిధి స్టాలిన్ గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రెండేళ్ల కింద‌టి నుంచే ఉద‌య‌నిధి స్టాలిన్ రాజ‌కీయాల్లో బిజీ అయ్యాడు. అంత‌కుముందు వ‌ర‌కు సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు. నిర్మాత‌గా విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు. 2012లో […]

బేబమ్మకు పోటీగా కేతిక.. నిజమేమిటంటే?

టాలీవుడ్ లో హీరోయిన్ల హవా నడుస్తోంది. ఈ మధ్య వచ్చిన ఇద్దరు హీరోయిన్ల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. వారెవరో కాదు..ఉప్పెన సినిమాతో పరిచయమైన కృతిశెట్టి, కేతిక శర్మ. ఉప్పెన సినిమాలో కృతిశెట్టి తన అందంతో, హావభావాలతో ఆకట్టుకుంది. కేతిక శర్మ కూడా పూరీ జగన్నాధ్ కొడుకుతో నటించి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సాధారణంగా హీరోయిన్ల మధ్య పోటీలు అనేవి మామూలే. గత సీజన్ లో చూస్తే పూజా హెగ్దే, రష్మిక మధ్య గట్టి […]

మరో సారి క్రేజీ కాంబో..?

బాలీవుడ్‌ స్టార్ దర్శకుల్లో సంజలీలా భన్సాలీ ఒకరు. హీరోల్లో షారుఖ్ ఖాన్ కూడా అదే రీతిలో అద్భుత విజయాలను అందుకున్నాడు. వీరిద్దరి కాంబోలో 2002లో దేవదాసు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇద్దరికీ మంచి బ్రేక్ ను ఇచ్చింది. అందులో షారుఖ్ సరసన మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో బ్రిటీష్ అకాడమి ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్‌కు ఎన్నికైంది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో మరో […]

బ్రేకింగ్: యంగ్ టైగర్ కు కరోనా పాజిటివ్.. పరిస్థితి..?

ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ లెవెల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న, పెద్ద, బుడుగు, ధనికుడు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతుంది. చేతిలో డబ్బులు ఎన్ని ఉన్నా కానీ కరోనా వైరస్ బారిన పడి చివరికి కొలుకో లేక మృతి చెందిన వారు ఎందరో ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన […]

వ్యాక్సిన్ తీసుకున్న కింగ్ కొహ్లీ..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాలని, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని సూచించాడు. వ‌చ్చే నెల‌లో న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌బోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైన‌ల్ కోసం భారత జట్టు త్వ‌ర‌లోనే ఇంగ్లాండ్ కు వెళ్ల‌నుంది. ఆలోపే ఆ టూరుకు వెళ్లే భారత జట్టులోని ఆటగాళ్లందరూ త‌మ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవాల‌ని […]

పుదుచ్చేరి సీఎంకి కరోనా పాజిటివ్..!

కరోనా వల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా చాలా మంది సీనియర్‌ రాజకీయ నేతలు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. గతంలో కొందరు సీఎంలకు కూడా కరోనా రావడం కలకలం రేపింది. తాజాగా పుదుచ్చేరికి ప్రమాణ స్వీకారం చేసిన కొత్త సీఎం ఎన్ రంగస్వామి కరోనా బారిన పడ్డారు. మొన్నటికి మొన్న […]

ప్రముఖ క్రికెటర్ ఇంట్లో విషాదం …!

టీమిండియా లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన అతని తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా కరోనా పోరాడిన పీయూష్ తండ్రి చివరకు మహమ్మారికి బలైయ్యారు. ఈ విషయాన్ని పీయూష్ చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించారు. నాన్న లేకుండా మిగతా జీవితం గతంలోలా ఉండదని, ఈ రోజు తన మూల స్తంభంను కోల్పోయా అని పీయూష్ […]

ప్లీజ్ సాయం చేయండి..ప్రియుడి త‌ల్లి కోసం పాయ‌ల్ అభ్య‌ర్థ‌న‌!

ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పాయిల్ రాజ్ పుత్‌.. మొద‌టి చిత్రంతోనే మంచి విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోవ‌డంతో పాటు న‌ట‌న ప‌రంగా విశ్వ‌రూపం చూపించింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌, ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. పాయ‌ల్ సౌరబ్ దింగ్రాతో గ‌త కొద్ది రోజులుగా ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని పాయ‌ల్ ఓపెన్‌గానే ప్ర‌క‌టించేసింది. […]

కరోనా బారీన పడిన మరో ఎమ్మెల్యే..!

ఏపీలో కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోవడం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. తనతో తిరిగిన కార్యకర్తలు, అభిమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని […]