బ్రేకింగ్: యంగ్ టైగర్ కు కరోనా పాజిటివ్.. పరిస్థితి..?

ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ లెవెల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న, పెద్ద, బుడుగు, ధనికుడు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతుంది. చేతిలో డబ్బులు ఎన్ని ఉన్నా కానీ కరోనా వైరస్ బారిన పడి చివరికి కొలుకో లేక మృతి చెందిన వారు ఎందరో ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డాడు. ఇందుకు సంబంధించి ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో తెలియజేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ లో కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన వెంటనే దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే మన టాలీవుడ్ పరిశ్రమలో అనేక మంది బడా హీరోలు, హీరోయిన్లు కరోనా బారిన పడి కోలుకున్నారు.