అంకుశం మళ్ళీ రాబోతుంది!

వెండితెరపై ఎన్ని పోలీస్ పాత్రలు వచ్చినా అంకుశం లో రాజశేఖర్ పోషించిన పోలీస్ పాత్ర ప్రత్యేకం అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే పోలీస్ పాత్రకి హీరోయిజం తెచ్చిన పాత్ర కూడా అదే. ఆ సినిమా లో రాజశేఖర్ పోలీస్ పాత్రకి ప్రాణం పోశారనే చెప్పాలి. అంతగా మెప్పించారు రాజశేఖర్ ఆ పాత్రని. అయితే.. కొన్నేళ్లుగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ మళ్ళీ సిల్వర్‌ స్క్రీన్‌పై మరోసారి పోలీస్‌గా దర్శనమిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ […]

సిక్స్ ప్యాక్ చేస్తున్న కల్యాణ్

పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇజం’. ప్రస్తుతం ఈ సినిమా.. చిత్రీకరణ దశలో వుంది. ఈ చిత్రం ఫస్టులుక్ లో కల్యాణ్ రామ్ స్ట్రక్చర్‌ చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే కల్యాణ్ రామ్ కాస్త సన్నగా కనిపించారు. ఆయన లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఇజం’లో హీరో రోల్ కోసం బరువు తగ్గవలసి ఉంటుందనీ .. సిక్స్ ప్యాక్ తో కనిపించాల్సి ఉంటుందని పూరీ ముందుగానే కల్యాణ్ రామ్ కి చెప్పాడట. అందుకే ఆయన ఇలా సన్నగా మారిపోయాడట. ‘ఇజం’ […]

‘కబాలి’కి కత్తిరింపులు!

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ మూవీకి ఉండే క్రేజ్ ఏ సినిమాకీ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆయన సినిమా వస్తోందంటే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంటుంది. కబాలికీ అలాంటి రెస్పాన్సే నెలకొంది. వివిధ రకాల ప్రచారం ఆ సినిమాకి విపరీతమైన హైప్ ను తీసుకువచ్చింది. అయితే, శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చినప్పటికీ, సినిమా సాగతీత ధోరణిలో ఉందన్న టాక్ వచ్చింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల నిడివి బాగా ఎక్కువవడంతో ప్రేక్షకులు కాస్త […]

బాలయ్య మంచి మనసుకి ఫిదా అయిన క్రిష్

నటసింహం నందమూరి బాలకృష్ణ ఏది మొదలుపెట్టిన వదిలిపెట్టడు అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తన 100 వ చిత్రమయిన గౌతమి పుత్ర శాతకర్ణి కి తానే స్వయంగా బ్రేక్ వేశాడు.గౌతమి పుత్ర శాతకర్ణి ప్రస్తుతం జార్జియా లో షూటింగ్ జరుపుకుంటుంది అప్పుడే 50 శాతం వరకు షూటింగ్ పూర్తిఅయినట్టు సమాచారం. ఇంతటి వేగంగా సాగుతున్న షూటింగ్ కి స్వయానా బాలయ్యే బ్రేక్ వేశాడు కానీ అది తనకోసం కాదు డైరెక్టర్ క్రిష్ కోసం. అవును ఆగస్ట్ 8 […]

‘బాహుబలి’ని క్రాస్ చేసిన కబాలి

ఒకప్పుడు ఫలానా సినిమా 100 రోజులు ఇన్ని సెంటర్లలో ఆడింది అదే ఇప్పటివరకు రికార్డు అని చెప్పుకునే వారు.దాన్నే బెంచ్ మార్క్ గా మిగతా సినిమాలు పోటీ పడేవి.అయితే కాలం మారింది.ఇప్పుడంతా కలెక్షన్స్ లెక్కలే ఏ సినిమాకైనా.అందులోనా కలెక్షన్స్ ని అందరు రెండుగా చూస్తున్నారు..బాహుబలి కి ముందు.. బాహుబలి తరువాత అని..అంతలా సౌత్ సినిమా రేంజ్ ని పెంచేసింది మన బాహుబలి.ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా సరే బాహుబలి కలెక్షన్ తో లెక్క కడుతున్నారు..అందరికి అదే […]

రవితేజకి ఏమయ్యింది !

హీరో రవితేజకి ఏమయ్యింది? అని సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే రవితేజ చకచకా సినిమాలు చేసేస్తాడు కానీ ఇప్పటిలా ఇంతకుముందెన్నడూ అతను గ్యాప్‌ తీసుకోలేదు. ‘రాబిన్‌హుడ్‌’ అనే సినిమా ఫైనల్‌ అయ్యిందని కొన్నాళ్ళ క్రితం వరకూ అనుకున్నా అది పట్టాలెక్కలేదు. ఇంకో ఇద్దరు ముగ్గురు దర్శకులతో రవితేజ సినిమాలు చేస్తాడనే వార్తలొచ్చినా అవీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. దాంతో రవితేజ అభిమానుల్లో టెన్షన్‌ పెరిగింది. ఆ మధ్య సిక్స్‌ ప్యాక్‌ కోసం ప్రయత్నించిన రవితేజ ఆ […]

కయ్యమా,వియ్యమా: బాబు దారెటు ?

ప్రత్యేక హోదా అనే పదాన్ని వినడానికి కూడా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇష్టపడటంలేదు. ఆ ఎన్‌డిఎ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగమే. రాజ్యసభలో ఈ రోజు జరగాల్సిన ఓటింగ్‌ని భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా జరగనీయలేదు. కానీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రత్యేక హోదా బిల్లుకి అనుకూలంగా ఓటేయడానికి సిద్ధమైంది. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో. బిజెపి నుంచి ‘బిల్లుపై ఓటింగ్‌ జరగనీయం’ అని హామీ వచ్చిన తర్వాతే, ‘ఆ బిల్లుకి అనుకూలంగా ఓటేస్తాం’ […]

బాబోయ్ పొకెమాన్ చంపేస్తోంది!

ప్రపంచవ్యాప్తంగా 26కు పైగా దేశాల్లో విడుదలైన ఆన్‌లైన్ రియాల్టీ గేమ్ పొకెమాన్ పలు దేశాల్లో వివాదాస్పదమైంది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ఆధారంగా ఆడే ఈ గేమ్‌లో వాస్తవ ప్రదేశంలో ఒకరు పొకెమాన్ చిత్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఆటగాళ్లు.. జీపీఎస్, గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతుక్కొంటూ వెళ్లి దానిని గుర్తించాలి. ఈ గేమ్ కొందరికి ఎగ్జైటింగ్‌గా ఉన్నా.. మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఆట ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ సౌదీ అరేబియా మత పెద్దలు పొకెమాన్‌పై ఇప్పటికే ఉన్న ఫత్వాను పునరుద్ధరించారు. […]

అయ్యోపాపం ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్‌ని ఇప్పుడు చాలా జాలిగా చూడాల్సిన సందర్భం. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ దయనీయ స్థితిని చూసి చలించిపోవాలి. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అంతర్భాగమన్న విషయాన్ని ఒకప్పటి కాంగ్రెసు ప్రభుత్వం, ఇప్పటి బిజెపి ప్రభుత్వం విస్మరించాక, ఆంధ్రప్రదేశ్‌ గోడు ఎవరు పట్టించుకుంటారు? ప్రత్యేక హోదా హామీ రెండున్నరేళ్ళ క్రితం పార్లమెంటే ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చింది. కానీ అది అమలు కాలేదు. దాని అమలు కోసం ఇంకో బిల్లు ప్రైవేటుగా పార్లమెంటులో పెట్టవలసిన దుస్థితి ఇంతవరకు దేశంలో ఏ […]