ఆ విధానానికి విష్ణు మద్దతు ఇస్తున్నరా …?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల టికెట్ల అమ్మకం లో తీసుకు వస్తున్న ఆన్లైన్ విధానాన్ని పూర్తిగా సమర్ధిస్తున్నారని మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ థియేటర్ల టికెట్ల అమ్మకం లో కొన్ని నిజంగానే కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రొడ్యూసర్లకు మరియు ప్రభుత్వానికి అందాల్సిన డబ్బు మధ్యలో వారే తీసుకుంటున్నారని తెలిపారు. పిట్లం ఇంటి దగ్గర ఉన్నాను ఒక నిర్మాతగా తాను కూడా ఆన్లైన్ టికెట్ విధానానికి పూర్తిగా మద్దతిస్తున్నట్లు తెలిపారు దీనివల్ల తమను నిలదీసే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటదని ఒక వేళ ప్రకాష్రాజ్ అడిగినా కూడా చూపిస్తానని తెలిపారు అయితే తనకు రాజకీయాలపై అవగాహన లేదని అన్నారు.

పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అని.. ఆయన సపోర్ట్ తమకు కావాలి అని అన్నారు. ”మా అసోసియేషన్ మన తల్లి అని దాన్ని జాగ్రత్తగా చూసుకో విష్ణు” అని పవన్ కళ్యాణ్ తనకు చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన తండ్రి కోపం అందరికీ తెలుసునని పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత తమపై దాడి చేశారని వారు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కావాలంటే సిసి ఫుటేజీలను కూడా చూసుకోవచ్చునని, తనకు ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిపారు.