ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఇపుడు చర్చ అంతా సెకండ్ పార్ట్ గురించి నడుస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా బింబిసార1 ఉందని నెటిజన్ల నుంచి ప్రసంశలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ వశిష్ట, కళ్యాణ్ రామ్ బింబిసార2 కథ గురించి ఓ మీడియా […]
Author: Suma
పెళ్లి గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చేసిన నటి పూర్ణ.. ఏమన్నారంటే?
నటి పూర్ణ గురించి అందరికీ తెలిసినదే. మొదట పలు సినిమాల్లో నటించి హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పూర్ణ ఇపుడు పలు టీవీ షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యనే పూర్ణకి పెళ్లి కుదిరినట్టు అధికారికంగా ఓ ప్రకటన వచ్చిన సంగతి విదితమే. UAEకి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పూర్ణ పెళ్లి చేసుకోబోతుంది. అసిఫ్ అలీ JBS గ్రూప్ ఆఫ్ కంపెనీలకు CEO, మరియు ఫౌండర్. ‘జమా అల్ మెహరి’ […]
Bigg Boss 6 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.. షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా?
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Bigg Boss 6 త్వరలో రాబోతుందంటూ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 4 నుంచి Bigg Boss 6 సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ ప్రేక్షకులకు ఒక్కటే కన్ఫ్యూజన్. ఈసారి ఈ షోలోకి మొత్తం ఎంతమంది వస్తారు? ఎవరెవరు వస్తారు? అని. ఆ విషయం ప్రస్తుతం రివీల్ అయింది. ఈ షోలోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ రాబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో 10 మంది అమ్మాయిలు.. […]
వేణుకి కలిసి రానిది, సుమంత్ కి కలిసొచ్చింది.. ఏమిటో తెలుసా?
ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని మాత్రమే వినబడే రోజులు మారాయి. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అన్న రేంజ్ కి మనవాళ్ళు ఎగబాకారు. మన తెలుగు సినిమాలకు దేశవిదేశాల్లో కూడా ఆదరణ దక్కుతుంది. ఒకప్పుడు హిందీ సినిమా రాజ్యమేలుతున్నవేళ హిందీ సినిమాల్లో నటించే స్టార్లను తమ సినిమాల్లోకి తీసుకుంటే బాగా మార్కెట్ చేసుకోవచ్చు అని సౌత్ లో ఉన్న దర్శక నిర్మాతలు భావించేవారు. ఇప్పుడు లెక్కలు మారాయి. ఇప్పుడు మన తెలుగు సినిమా ఆర్టిస్ట్ […]
కంటెంట్ లేక బోల్తా పడిన సినిమాలు OTT రిలీజ్‌కు రెడీ అయిపోతున్నాయి!
కరోనా మహమ్మారి తర్వాత సినిమా రంగానికి గడ్డు పరిస్థితులు తలెత్తాయని స్పష్టమౌతోంది. ఈ క్రమంలో థియేట్రికల్ మార్కెట్ కంటే, OTT మార్కెట్ గణనీయంగా పెరగడం కూడా చిత్ర పరిశ్రమపై గొడ్డలిపెట్టులాగా మారింది. దీంతో రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా OTTల వైపే మొగ్గు చూపుతున్నారు. కొన్ని సినిమాలకు థియేటర్ దాకా వెల్లే బజ్ క్రియేట్ కాకపొవడంతో.. బాక్సాఫాస్ వద్ద అవి ఫ్లాప్ లుగా నిలిచిపోతున్నాయి. అయితే.. గత నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని […]
ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏడేళ్లపాటు అజ్ఞాతంలో గడిపిన హీరో ఎవరో తెలుసా?
సినిమా జీవితం అంటే అదేదో మనం చాలా తేలికగా ఊహించేసుకున్న రంగులమయం జీవితం కాదు. ఆ జీవితం వెనుక ఎన్నో కన్నీళ్లు కష్టాలు ఉంటాయి. సినీ తారల జీవితాలలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బైతే సంపాదిస్తారు కానీ, అనుభవించేది మాత్రం శూన్యమే అని చెప్పుకోవాలి. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి పుష్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడు మలయాళ హీరో ఫహద్ ఫాజిల్. ఆ తర్వాత తమిళ సినిమా విక్రమ్ సినిమాలో నటించి […]
టాలీవుడ్ సమ్మె.. ప్రభాస్ కు ఎంత నష్టమో తెలుసా?
సినిమా నిర్మాణ వ్యయం పెరగడం, థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.. ఆగస్టు 1వ తేదీ నుంచి టాలీవుడ్ నిర్మాతలు సమ్మె చేస్తున్నారు. నిర్మాణ వ్యయం తగ్గకపోతే ఇండస్ట్రీ మనుగడ కష్టమవుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఓటీటీల్లో విడుదలకు 10 వారాల లాక్ ఇన్ పీరియడ్ అమలు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.. అయితే సమ్మె జరుగుతున్నా కూడా చాలా సినిమాల షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. అయితే […]
మొదట నమ్రతను మహేశ్ ఫ్యామిలీ అంగీకరించలేదనీ మీకు తెలుసా..? మహేష్ ఏం చేసాడంటే?
తెలుగు పరిశ్రమలో ముచ్చటైన జంట ఏది అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మహేశ్‌బాబు-నమ్రత జంట. అవును.. వారికి పెళ్ళై 17 ఏళ్ళు దాటుతున్నా వారు ఇప్పటికీ నూతన దంపతులలాగే వ్యవహరిస్తారు. వారి మధ్య ప్రేమకు ఇదే ఓ కారణం. అందుకనే టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఇక వీరిద్దరిని ప్రేమ అనే అంశంతో ముడివేసింది ‘వంశీ’ అనే సినిమానే. ఇక ఎవరికీ తెలియని ఓ విషయం ఏమంటే ఈ సినిమా అవుట్‌డోర్ షూటింగ్‌లో భాగంగా చిత్ర […]
టాటూ వేసుకుంటే.. హెచ్ఐవి వచ్చింది.. వారణాసిలో ఏం జరిగింది?
అసలు పెళ్లి కాలేదు.. ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదు.. కానీ ఆ యువకులకు హెచ్ఐవి పాజిటివ్ గా వచ్చింది. వారణాసిలోని పిటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో 12 మంది యువకులకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు వెల్లడైంది.. అయితే హెచ్ఐవి వచ్చిన వారు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు.. వారికి అసలు పెళ్లి కూడా కాలేదు.. దీనిపై విచారణ జరపగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. వారణాసిలోని ఓ ప్రాంతానికి చెందిన యువకుడు ఇటీవల సరదాగా టాటూ […]








