w/o మోడీ కిరానా షాప్ లోనా!

కిరాణా దుకాణం నడుపుతున్న ఈ పెద్దమనిషి ఎవరో గుర్తుపట్టారా..? ప్రధాని మోడీ సతీమణి యశోదబెన్. ఆ కిరాణా షాపులో ఆమె ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా..? టీచర్ గా పని చేస్తున్నారని అన్నారు కదా.. ఇదేంటి ఇలా షాపులో పని చేస్తున్నారు.. ఎంత కష్టమొచ్చింది అనుకుంటున్నారా..?

ఆగండాగండి.. ఒక్క క్షణం. ప్రస్తుతం గుజరాత్ లోని ఉంజా గ్రామంలో ఉంటున్న యశోదాబెన్.. తన తమ్ముడి ఇంట్లో ఉంటున్నారు. ఈ షాపు అతనిదే. ఖాళీ సమయాల్లో ఇదిగో ఇలా కిరాణా సామాను అమ్ముతున్నారు. మరో విషయం ఏంటంటే సెక్యురిటీ విషయంలో ఎలాంటి తేడా లేదు. యశోదాబెన్ ఎక్కడికి వెళ్లినా పోలీసులు మాత్రం ఆమె వెంటే ఉంటారు. ప్రధాని భార్యగా ఆమెకు సెక్యురిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం