నేను ఎవ్వరినీ ప్రేమించడంలేదు..నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.. నేను ప్రెగ్నెంట్ కాదు..ఇన్ని మాటలు చెప్పిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోరణవీర్ సింగ్‌తో లవ్‌లో ఉన్నట్లా లేనట్లా అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులకు వీరిద్దరూ ప్రేమలో పడ్డారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ విశేషమేమిటంటే.. ఇర్ఫాన్ ఖాన్ హీరోగా నటించిన మదారి స్క్రీనింగ్‌కు వచ్చిన రణవీర్ దీపికలు బహిరంగంగానే ముద్దు పెట్టుకోవడం కెమెరా కంటికి చిక్కింది.. తాజాగా ఓ బర్త్‌డే పార్టీకి విచ్చేసిన వీరిద్దరూ..ఒక్క క్షణం కూడా ఒకరిని వదిలి ఒకరిని ఉండలేకపోయారట. పార్టీ తర్వాత తన మస్తానీని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకెళ్లాడట బాజీరావ్. అయితే ఈ కపుల్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కుతారా..లేక టైంపాస్ చేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.