రెండేళ్ల గ్యాప్ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ నటించిన సినిమా రాజా ది గ్రేట్. 2015 దీపావళికి వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకుని మనోడు నటించిన సినిమా బెంగాల్ టైగర్. పటాస్, సుప్రీమ్ సినిమాలతో హిట్ కొట్టి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో పాటు దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రవితేజ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్గా నటించింది. రవితేజ అంధుడిగా నటించడంతో సినిమాకు రిలీజ్‌కు ముందే హైప్ వచ్చింది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్ షో టాక్ ప్రకారం
టాక్ ఎలా ఉందో చూద్దాం.
సినిమా ఫస్టాఫ్ మొత్తం రవితేజ ఎనర్జిటిక్ ఫెర్పామెన్స్తో డీసెంట్‌గా ముగిసింది. వయస్సు పైబడినా రవితేజ తనలో ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. డైలాగ్ డెలివరీ, ఇంటర్వెల్ బ్యాంగ్, రవితేజ – పృథ్వి – రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా ఫస్టాఫ్‌లో బాగున్నాయి. హీరోయిన్ మెహ్రిన్ సమస్యల్లో ఉంటే ఆ సమస్యల నుంచి రవితేజ ఆదుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫస్టాఫ్‌లో బాగున్నాయి.
ఇక కీలకమైన సెకండాఫ్‌లో మాత్రం కాస్త సాగదీత కనపడింది. అయినా ఎంటర్టైన్మెంట్ పరంగా బాగా ఉండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవడం కలిసొచ్చింది. అనిల్ రావిపూడి ఎప్పుడూ మెయింటైన్ చేసినట్టుగానే సినిమా గ్రాఫ్ మాత్రం ఇందులో కూడా పడలేదు. రవితేజ అంధుడిగాను అదే గ్రాఫ్ ఎనర్జిటిక్ పెర్పామెన్స్ ఇచ్చాడు.
స్టోరీ పరంగా రొటీన్ రివేంజ్ డ్రామానే అయినా బలమైన కామెడీ సీన్లు సినిమాను పెద్ద ఎస్సెట్. ఇక సినిమాటోగ్రఫీ, రవితేజ ఎనర్జిటిక్ నటన, హీరోయిన్ మెహ్రిన్ అందాలు, సినిమాటోగ్రఫీ సినిమాలకు ప్లస్. ఇక రొటీన్ రివేంజ్ డ్రామా, సెకండాఫ్, కాస్త ఎక్కువైన రన్ టైం (149) నిమిషాలు మైనస్. ఓవరాల్‌గా కామెడీ అదిరిపోవడంతో ఈ సినిమా కమర్షియల్‌గా బాగా వర్క్ అవుట్ కానుందని తెలుస్తోంది. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగు జర్నలిస్టు.కామ్