సూపర్‌స్టార్ మహేష్ – సంచలనాల దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ కలయికలో సినిమా వస్తోంది అనగానే సౌత్ ఇండియాలోనే కాదు బాలీవుడ్‌లోను ఒకటే క్యూరియాసిటీ. దాదాపు యేడాదికి పైగా ఊరిస్తూ ఊరిస్తూ వస్తోన్న స్పైడర్ ఎట్టకేలకు రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. భారీ అంచనాలకు తగ్గట్టుగానే స్పైడర్ మహేష్‌బాబు కెరీర్లోనే రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కడంతో ఈ సినిమాలో ఏదో మిరాకిల్ జరగబోతోందని అనుకున్నారు.
తొలి టీజర్‌తోనే గ్లింప్స్ మొదలై, ట్రైలర్‌తో అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగుల రూపంలోనే మిలియన్ డాలర్ క్లబ్లో చేరింది. ఏ టాలీవుడ్ హీరోకి లేని అసాధారణ రికార్డ్ ఇది. ఈ సినిమాకు ఇప్పటికే సెన్సార్ల ద్వారా పాజిటివ్ టాక్ సొంతమైంది.
స్పైడర్ సినిమాపై మురుగదాస్ రివ్యూ ఇచ్చేశారు. ఈ సినిమా తమిళ ప్రమోషన్లపై ఎక్కువుగా కాన్సంట్రేషన్ చేస్తోన్న ఆయన స్పైడర్ గురించి మాట్లాడారు. స్పైడర్ తన సినిమాలోనే భారీతనం నిండిన కమర్షియల్ సినిమా. ఒక బలమైన కథానాయకుడు, అంతే తెలివైన ప్రతినాయకుడు తలపడితే ఎలా ఉంటుందో తెరపై చూపిస్తున్నా. మహేష్‌ని వందశాతం కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నానని మురుగదాస్ చెప్పాడు.
స్పైడర్ టెక్నికల్‌గా అత్యద్భుతంగా ఉంటుందని, మహేష్ తొలిసారి తెలుగు తెరపై హీరోగా ఇంట్రడ్యూస్ అవుతుండడంతో చాలా కేర్‌గా సినిమాను ప్రజెంట్ చేశనని మురుగదాస్ చెప్పాడు. ఇది అదిరిపోయే కమర్షియల్ సినిమాగా మురుగదాస్ ఫైనల్ టచ్ ఇచ్చాడు. మురుగదాస్ మాటలను బట్టి చూస్తుంటే స్పైడర్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేయడంతో పాటు వసూళ్ల వీరంగం ఆడేయడం ఖాయంగా కనిపిస్తోంది.