నందమూరి హీరోలుఅయిన నందమూరి బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్ మధ్య విబేధాలపై ఎప్పటి నుంచో వార్తలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఇటీవల కాలంలో సఖ్యత కుదిరిందని అందరూ అనుకుంటున్నారు. అయితే అది కేవలం ప్రచారం మాత్రమేనా ? ఎన్టీఆర్ – బాలయ్య మధ్య సఖ్యత ఇప్పట్లో కుదిరేపనికాదా ? అంటే తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి.
బాలయ్య పైసా వసూల్ ప్రమోషన్లో భాగంగా బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ షోకు వెళతాడని వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. బాలయ్య ఎన్టీఆర్‌కు హ్యాండ్ ఇచ్చేశాడు. దగ్గుబాటి రానా హోస్ట్ చేస్తున్న నెంబర్ 1 యారి షోకు బాలయ్య-పూరీ జగన్నాథ్ వెళుతున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది.
బాలయ్య ఇప్పటి వరకు ఏ బుల్లితెర షోకు కూడా రాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం రానా షోకు వస్తుండడం విశేషం. ఇక రానా నెంబర్ 1 యారికి బాలయ్య వస్తుండడంతో అటు ఎన్టీఆర్‌కు షాక్‌గానే చెప్పాలి. కొద్ది రోజులుగా టాలీవుడ్లో రిలీజ్ అవుతోన్న పలు సినిమాలకు సంబంధించిన హీరో, హీరోయిన్లు బిగ్ బాస్ షోకు వెళ్లి మరీ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే బాలయ్య కూడా పైసా వసూల్ ప్రమోషన్ కోసం అక్కడకు వెళతారని అందరూ అనుకున్నా ఇప్పుడు బాలయ్య రానా షోకు వస్తున్నాడు. దీనిని బట్టి బాలయ్య-ఎన్టీఆర్‌కు మధ్య గ్యాప్ అలాగే ఉందని అర్థమవుతోంది.