బాహుబలి – ది కంక్లూజన్ సినిమాతో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా ఎలా మార్మోగిపోతుందో చూస్తున్నాం. బాహుబలి ప్రతి క్షణానికో రికార్డు తన అక్కౌంట్లో వేసుకుంటోంది. అలాంటి రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటా అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది సినీ అభిమానుల మదిని తెగ తొలచి వేస్తోంది. రాజమౌళి నెక్ట్స్ సినిమా రేసులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, అమీర్‌ఖాన్ ఇలా చాలా మంది హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రాజమౌళి నెక్ట్స్ సినిమా స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌తో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డీజే సినిమాలో నటిస్తోన్న బన్నీ ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ సినిమా చేసి ఆ తర్వాత రాజమౌళి సినిమాలో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాహుబలి హిట్‌ను ఎంజాయ్ చేస్తోన్న రాజమౌళి రిలాక్స్ తర్వాత బన్నీ సినిమా కోసం కథ రెడీ చేస్తాడట.
ఇక ఈ క్రేజీ ప్రాజెక్టును అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తాడని సమాచారం. దానయ్య ఇప్పటికే రాజమౌళితో పాటు అల్లు అర్జున్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చాడని సమాచారం. ఈ కాంబినేషన్ సెట్ అయితే బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండదు.