ప్ర‌భాస్ సాహో హీరోయిన్ ఫిక్స్‌..!

బాహుబ‌లి సినిమాతో యంగ్‌రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ హీరో అయిపోయాడు. బాహుబ‌లి 1, 2 దెబ్బ‌కు ప్ర‌భాస్‌కు ఏకంగా నేష‌న‌ల్ మార్కెట్ వ‌చ్చేసింది. ఈ దెబ్బ‌తో మ‌నోడికి ఇత‌ర భాష‌ల్లో కూడా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భాస్ త‌న నెక్ట్స్ సినిమాల విష‌యంలో ఇత‌ర భాష‌ల్లోను మార్కెట్‌ను విస్త‌రించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు.

బాహుబ‌లి కోసం ఏకంగా నాలుగేళ్ల టైం కేటాయించిన ప్ర‌భాస్ ఇప్పుడు వ‌రుస‌గా ఇత‌ర ప్రాజెక్టుల‌కు క‌మిట్ అవుతున్నాడు. ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజీత్ డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ సాహో సినిమాలో న‌టిస్తున్నాడు. రూ. 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ హింది మలయాళం భాష‌ల్లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

నాలుగు భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీలు దీపికా ప‌డుకొనే, ప‌రిణితి చోప్రా పేర్లు ప‌రిశీలించారు. అయితే ఇప్పుడు త‌మ‌న్నా పేరు ఫైన‌లైజ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి బాహుబ‌లితో పాటు రెబ‌ల్ సినిమాలో కూడా న‌టించిన సంగ‌తి తెలిసిందే.