టాలీవుడ్ నందమూరి నగటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2. మారో పది రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. నిర్మతలు దానికి తగ్గట్టే ప్రమోషన్లను సైతం స్పీడ్ అప్ చేశారు. ముంబైలో సాంగ్ లంచ్ చేసిన టీం.. వైజాగ్ నుంచి హైదరాబాద్ దాకా ఎన్నో ఈవెంట్లను ప్లాన్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో జరగబోయే ఫ్రీ రిలీజ్ వేడుకకు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ గెస్ట్ గా హాజరుకానున్నట్లు తెలుస్తుంది. రేవంత్‌కు బాలయ్యతో ఉన్న స్నేహం, ఒకప్పుడు టిడిపి పార్టీతో ఉన్న అనుబంధం దృష్ట్యా.. వీళ్ళిద్దరూ స్టేజ్ పై కనిపించనున్నారని తెలుస్తుంది.
అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఇక.. సినిమాకు ప్రస్తుతం ఉన్న హైప్ సరిపోతుందా అంటే మాత్రం లేదనే చెప్పాలి. అఖండ ఫస్ట్ పార్ట్ ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో.. ఎలాంటి కలెక్షన్లు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా తర్వాత జనాన్ని తండోపతండాలుగా థియేటర్లకు రప్పించిన సినిమాల్లో అఖండనే మొదటిది. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే.. బజ్ ఏ రేంజ్ లో ఉండాలి. కానీ.. థమన్ నుంచి వచ్చిన రెండు సాంగ్స్ అలాంటి రెస్పాన్స్ ను దక్కించుకోలేకపోయాయి. ఇక ట్రైలర్లో యాక్షన్ కంటెంట్ ఎక్కువ అయిపోయిందని విమర్శలు సైతం వినిపించాయి. మరోపక్క వీటన్నిటితో సంబంధం లేకుండా థియేటర్ బిజినెస్ జరుగుతుంది.

ఈసారి టార్గెట్ ఏకంగా రూ.200 కోట్లు అని సమాచారం. ఇక డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా.. ముందు రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్స్‌తో రంగంలోకి దిగనుందట. పర్మిషన్స్ రావడమే ఆలస్యం.. అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారు టీం. ఇక ప్రీమియర్ షోస్‌కు భారీ టికెట్ రేట్లు ఉంటాయని బాధ అవసరం లేదని.. అందరికీ అందుబాటు ధరల్లోనే టికెట్ కాస్ట్‌లు ఉంచుతామని ప్రొడ్యూసర్ తాజాగా వెల్లడించాడు. ఇక అఖండ 2 సోలో సింహం గా ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. బాలీవుడ్ లో మాత్రం రణ్వీర్ సింగ్ దురంధర్ మూవీ సినిమాకు పోటీగా నిలిచింది. అక్కడ మాత్రం కాస్త టఫ్ ఫైట్ ఎదుర్కోవాలి. ఇక ఆడియన్స్ అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నా సరే.. కచ్చితంగా అఖండ 2 అంతకు రెండింతలు ఆడియన్స్‌ను సాటిస్ఫై చేస్తుందని టీం స్ట్రాంగ్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఏంటో చూడాలి.

