రజిని – చిరు కాంబో ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సోలో హీరోలుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ.. కొంతమంది మాత్రమే ఆడియన్స్‌ను ఆకట్టుకొని.. సూపర్ స్టార్లుగా మారతారు. వరుస సినిమాలతో టాప్ హీరోలుగా ఎలివేట్ అవుతారు. అలా.. తమిళ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ ఇప్పటికీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ.. తన లుక్, యాటిట్యూడ్, స్టైల్‌తో ఆకట్టుకుంటున్నారు. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్నాడు. ఇక.. రజనీకాంత్‌కు తమిళ్‌తో పాటు.. తెలుగు ఆడియన్స్‌లోను అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే రజినీకాంత్ త్వరలో బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ సినిమాలో చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక‌ రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు కలిసి మ‌ల్టీ స్టార‌ర్‌ అనుకున్నారు కానీ అది వర్కౌట్ అయ్యే ప‌రిస్థితి లేదు. ఈ క్రమంలోనే.. రజనీకాంత్ తోటి హీరో.. అదే రేంజ్ స్ట్రాంగ్ కాంపిటేషన్ ఇచ్చే నటుడైన మెగాస్టార్ తో మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక టాలీవుడ్‌లో మెగాస్టార్‌కు ఉన్న క్రేజ్, ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బాబి డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే.. గతంలోనే చిరు, బాబి కాంబోలో వార్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు పై ఆడియన్స్ లో మరింత ఆసక్తి మొదలైంది. కాగా.. 2026 ఫిబ్రవరి నుంచి ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లనుందట. అంతేకాదు.. సినిమాలో రజనీకాంత్ ఒక 30 నిమిషాల పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటించనున్నాడని టాక్‌ నడుస్తుంది. ఏదేమైనా.. బాబి నిజంగా రజినీ, చిరంజీవిలతో ఓ ప్రాజెక్ట్‌ను చేసి ఇద్దరినీ సమపాళ్లల్లో చూపిస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. రజనీ, చిరంజీవి కాంబో అంటేనే ఎవర్గ్రీన్ కాంబినేషన్. కనుక.. మళ్లీ ఈ కాంబో స్క్రీన్‌పై రిపీట్ అయితే చూడాలని ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.