అఖండ 2 ప్రీమియర్స్‌, టికెట్ రేట్ల‌పై క్లారిటీ వచ్చేసిందోచ్‌..

నట‌సింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ అఖండ 2 తాండవం. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన.. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియన్ ప్రేక్షకులంతా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గత కొద్ది రోజులుగా సినిమాకు ప్రీమియర్స్ ఉంటాయని.. డిసెంబర్ 4 సాయంత్రం నుంచి చాలా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇందులో వాస్త‌వం ఎంతో.. టికెట్ రేట్లు ఎలా ఉండ‌నున్నాయో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనే మొదలైంది. కాగా.. తాజాగా ఈ వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. గతంలోనే డిసెంబర్ 4 ప్రీమియ‌ర్స్‌ ఉంటాయని మేము తెలియజేశాం అంటూ చెప్పుకొచ్చిన మేకర్స్‌.. ముందు రోజు ప్రీవియస్ ఉన్న ఈ సినిమా టికెట్ ధరలు మాత్రం భారీగా పెంచేయట్లేదని.. అందరికీ అందుబాటు ధరల్లోనే.. టికెట్లు ఉంటాయని చెప్పకొచ్చారు. సో ఇదివరకు ఇచ్చిన హైక్స్ లా కాదు.. మీడియం రేంజ్ లో ఈ రేట్స్ ఉండబోతున్నాయి.

సినిమా ఖచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చారు. ఇక.. ఈ సినిమాలో సంయుక్త మీన‌న్‌ హీరోయిన్గా నటించగా.. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. 14 రల్స్ ప్ల‌స్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీ అచంట ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక ఇప్పటికే.. సినిమా అవుట్ పుట్‌పై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.