బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను మించిన సస్పెన్స్.. వారణాసి అసలు స్టోరీ ఏంటి..!

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి. ఫస్ట్ గ్లింప్స్ తాజాగా రిలీజై గైస్‌ బంప్స్ తెప్పిస్తున్నాయి. జక్కన్న రేంజ్ ఇది అనేలా.. సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా.. ఈ గ్లింప్స్ ఉండడం విశేషం. ఈ క్రమంలోనే.. గ్లింప్స్‌ రిలీజ్ చేసిన పోస్టర్ల ద్వారా అభిమానులు తమకు నచ్చినట్లుగా కథలను అల్లేస్తూ వస్తున్నారు. మొదట సినిమా నుంచి జక్కన్న పృథ్వీరాజ్ సుకుమారాన్.. విలన్ లుక్ ను వదిలిన సంగతి తెలిసిందే. కుంభ రోల్‌లో ఆయన వీల్ చైర్‌లో కనిపించాడు. దాని చూసి.. వీల్ చైర్ నుంచి.. సినిమాలో విల్లనిజం, క్రూరత్వం మొత్తం చూపిస్తాడని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.

SS Rajamouli's 'Varanasi': A first look at the time-travel film | AP News

ఇక.. కొద్ది సినిమా నుంచి హీరోయిన్ ప్రియాంక చోప్రా.. మందాకినీ లుక్ రివిల్ చేశారు. ఎల్లో సారిలో ప్రియాంక సర్ప్రైజింగ్‌గా మెరిసింది కొద్ది గంటలకు మహేష్ రుద్ర అంటూ ఎద్దు పై త్రిశూలంతో కనిపించాడు. ఈ క్రమంలోనే గ్లింప్స్‌ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి.. ఏదో టైం ట్రావెల్ స్టోరీ అని.. అన్ని కాలాలను కనెక్ట్ చేస్తూ మహేష్ బాబు డాటెడ్‌ లైన్‌గా కనిపిస్తాడని క్లారిటీ వచ్చేసింది. కాగా.. ఇప్పుడు తాను తిరిగి మామూలు వాడు అయ్యేందుకు అత్యంత శక్తివంత‌మైన సంజీవని పొందేందుకు రుద్రను వాడుకుంటాడంటూ కథ‌ వైరల్ అవుతుంది. మందకిని ద్వారా రుద్రాతో సంజీవని పొందాలని ప్లాన్ చేస్తాడట. కుంభ అది పొందాక.. మందాకిని, కుంభ ఒకే టీం అనీ తెలియడంతో రుద్ర ఏం చేశాడనేదే వారణాసి కథ‌ అంటూ చెబుతున్నారు.

ఇక మరోపక్క టీజర్ రిలీజ్ టైం లో జక్కన్న మాట్లాడుతూ.. మహేష్ రాముడిగా కనిపిస్తాడని.. రామాయణంలో ముఖ్య ఘట్టాన్ని రూపొందించామంటూ చెప్పుకొచ్చాడు. సో రామాయణంలో.. ముఖ్య ఘట్టంగా రావణ సంహారంని ఈ క్రమంలోనే కుంభను వధించే టైంలో రాముడిగా.. రుద్ర విశ్వరూపం చూపిస్తాడని మరికొందరు అంటున్నారు. ఇలా వారణాసి గ్లింప్స్‌ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఎన్నో కథలు బయటకు వచ్చేస్తున్నాయి. అయితే.. ఇదంతా రాజమౌళి ప్రమోషన్స్‌లో భాగమని చెప్పొచ్చు. ఇప్పటికే.. జక్కన్న తెర‌కెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాల విషయంలోనూ ఇలాగే ఎన్నో సస్పెన్స్‌లు నెలకొన్నాయి.

Varanasi Movie: 'వారణాసి' జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం: మహేశ్‌బాబు

బాహుబలి టైంలో అయితే రెండో పార్ట్ కోసం కట్టప్ప అసలు బాహుబలి ఎందుకు చంపాడు అనేది ట్రెండ్ చేశాడు. ఆ టైంలో అందరూ తగ్గట్లు ఎన్నో కథలను ఊహించుకొని సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు.. వాళ్ళందరి అంచనాలను బోల్తా కొట్టిస్తూ జక్కన్న.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో వైవిద్యంగా చూపించి సర్ప్రైజ్ చేశాడు. ఇప్పుడు.. వారణాసి సినిమా విషయంలోనూ ఇలాగే కథ‌లు అన్నింటినీ బోల్తా కొట్టించి తనదైన స్టైల్ లో అద్భుతమైన ఔట్పుట్ చూపించబోతున్నాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రతి సినిమాకు ఆడియన్స్‌లో కథ పరంగా.. కంటెంట్ పరంగా, విజువల్ పరంగా ఆడియన్స్ ఎంగేజ్ చేసే రాజమౌళి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్‌తో సినిమాను చూపిస్తాడు. అందుకే.. జక్కన్న సక్సెస్ తప్ప ఫ్లాప్ తెలియని దర్శకుడుగా దూసుకుపోతున్నాడని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.