వారణాసి గ్లింప్స్ అట్టర్ ఫ్లాప్.. రాజమౌళి ప్లాన్ తుస్సుమందా..!

టాలీవుడ్ దర్శకుడు ధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్టును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ సినిమా ఆయన అనుకున్న రేంజ్‌లో సక్సెస్ అయితే మాత్రం.. ఈసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఓ వెలుగు వెలుగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. తాజాగా మేకర్స్‌ గ్లోబల్ ట్రోట‌ర్ ఈవెంట్‌ను గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు. సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ వీడియోలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ లెవెల్‌లో ఏర్పాటు చేశారు.

Varanasi trailer: Mahesh Babu's first look as Rudhra from SS Rajamouli film sees him ride bull, wield trishul | Hindustan Times

ఈవెంట్ కోసం మూవీ యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ప్రపంచ స్థాయి క్వాలిటీ చూపించేందుకు భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టారు. ఇక.. నిన్న రాత్రి గ్రాండ్ లెవెల్‌లో మూవీ టీం రిలీజ్ చేసిన స్పెషల్ ట్లింప్స్‌ వీడియో కోసం అయితే.. రాజమౌళి ఏకంగా నెల రోజులపాటు కష్టపడ్డాడట. స‌రైన తిండి, నిద్ర కూడా లేకుండా.. ఈ గ్లింప్స్‌ వీడియో కోసం పని చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలోనే లేని రేంజ్‌లో ఈ వీడియో ఉండాలని.. కేవలం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ప్రేక్షకుల్లో హైప్‌ను క్రియేట్ చేసేలా ప్లాన్ చేయాలని ఆయన ఎంతగానో కష్టపడినట్లు తెలుస్తుంది. అందుకే.. 100 అడుగుల భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటుచేసి ప్రేక్షకులకు లైవ్ అనుభూతిని కలిగించేలా అన్నింటినీ సిద్ధం చేశాడు. కానీ.. జక్కన అనుకున్నట్లు ప్లాన్ వర్కౌట్ కాలేదు. టెక్నికల్ సమస్యల వల్ల గ్లింన్స్‌ రిలీజ్ కి ఆలస్యమైంది.

Globetrotter event: Mahesh Babu and Rajamouli's next titled Varanasi

దానికి తగ్గట్లుగానే రిలీజ్ అయిన వీడియో సైతం పూర్తిగా ఫ్యాన్సులు సంతృప్తి పరచలేకపోయిందని.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్‌లో ఓ రేంజ్ అంచనాలు నెలకొంటాయి. అలాంటి మ్యూజిక్ కానీ.. మ్యాజిక్ కానీ.. మహేష్ బాబు రేంజ్ విజువల్స్ కానీ గ్లింప్స్‌ కనిపించలేదని.. తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ గ్లింప్స్ విషయంలో అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన్స్ విషయంలో రాజమౌళి సైతం అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలోనే.. ఆయన అభిమానులు మాత్రం.. రిలీజ్ అయ్యింది గ్లింప్స్ మాత్ర‌మే. రాజమౌళి, మహేష్ కాంబో అంటే.. ఏ రేంజ్‌లో విజువల్స్ ఉంటాయో.. ఎలాంటి వ‌ర‌ల్డ్ క్రియేషన్స్ ఉంటాయో అందరికీ తెలుసు.. ఈ చిన్న ఫెయిల్యూర్ దాటుకొని జక్కన్న అంతకుమించి అద్భుతాలను సినిమాలో చూపిస్తాడంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.