చిరు సినిమా కోసం అనిల్.. ఆ స్పెషల్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ క్రమంలోనే.. చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి రైటింగ్ స్కిల్స్ కలిస్తే ఔట్‌పుట్ ఏ రేంజ్‌లో వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టు.. వెంకటేష్ ఎనర్జీ తోడవడంతో ఆడియన్స్ లో సందడి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని.. థియేటర్స్‌లో నవ్వులు పూయడం ఖాయం అంటూ ఫ్యాన్స్ లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

Anil Ravipudi taking special care of Venkatesh character? | Anil Ravipudi  taking special care of Venkatesh character?

అభిమానుల అంచనాలకు తగ్గట్టే.. అనిల్ సైతం స్క్రిప్ట్ చాలా కేర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడట. ఈ క్రమంలోనే.. సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ఆడియన్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక.. తాజాగా ఈ సినిమా కోసం.. ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారంటూ టాక్ వైరల్ గా మారుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియోతో కలిసి.. మన శంకర వరప్రసాద్ గారు కోసం అనిల్ స్పెషల్ సాంగ్ డిజైన్ చేస్తున్నాడని.. ఆ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ ఎంచుకోనున్నట్లు సమాచారం.

Mana Shankara Vara Prasad Garu's song shoot to begin tomorrow with  Chiranjeevi and Nayanthara

ఇప్పటికే.. చిరంజీవి, నయనతార, వెంకటేష్ లాంటి భారీ కాస్టింగ్ నటిస్తున్న ఈ సినిమాపై.. కమర్షియల్ గా మంచి డిమాండ్ నెలకొంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సాంగ్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట అనిల్. అంతేకాదు.. సినిమా మొత్తానికి సాంగ్ హైలైట్ అయ్యేలా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా.. అనిల్ కు మొదటి నుంచి ఓ సెంటిమెంట్ ఉంది. తన గత సినిమాల్లో హీరోయిన్లను నెక్స్ట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కోసం సెలెక్ట్ చేస్తూ వచ్చాడు. మరి.. ఇప్పుడు చిరు సినిమా కోసం కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతాడా.. లేదా సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మరో స్టార్ హీరోయిన్‌ను రంగంలోకి దింపుతాడా వేచి చూడాలి.