టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ది మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఓజీ రూపొందిన సంగతి తెలిసిందే. సుజిత్ డైరెక్షన్‌లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా మెరిశారు. ఇక ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సినిమా ఓజి. ఈ సినిమా నిన్న పాన్ వరల్డ్ రేంజ్ లో గ్రాండ్గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను దక్కించుకుని కలెక్షన్స్ పరంగాను దూసుకుపోతుంది.
ఇక సినిమా ప్రీమియర్స్ కూడా ప్రారంభం కాకముందే ఓపెన్ బుకింగ్స్ లో సంచలనాలు సృష్టించాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో కావడమే సినిమాకు ఈ రేంజ్ లో హైప్ ఏర్పడింది. ఇక.. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా సినిమాకు మొదటి రోజు ఏకంగా రూ.167 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు పవర్ స్టార్. ఆయన సినీ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ రికార్డు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు.. ఏరియాలో పరంగాను సినిమా చాలా చోట్ల బ్రేక్ ఇవన్నీ సాధించింది. ఇక నైజంలో అయితే అందరూ ఊహించినట్లుగానే ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేశాడు పవర్ స్టార్.
కేవలం ఒక నైజాం ఏరియా లోనే జీఎస్టీ లతో కలుపుకొని ఏకంగా రూ.27 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రూ.70 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక నిన్న మొన్నటి వరకు ఓజీ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ అని.. పవన్ కెరీర్‌లోనే ఒక్క రూ.100 కోట్ల ఓపెనింగ్ సినిమా కూడా లేదంటూ ట్రోల్స్ చేసిన ట్రోలర్స్‌కు, యాంటీ ఫ్యాన్స్ అందరికీ పవన్ ఓజీతో స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. కేవలం ఒక్కరోజులోనే రూ.167 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి.. రూ.100 కోట్ల ఓపెనింగ్ కాదు.. ఏకంగా రూ.150 కోట్ల ఓపెనింగ్ మూవీస్ లిస్ట్ లోకి చేరిపోయారు. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి.