ప్రీమియర్స్ తో రికార్డులు సృష్టించిన సినిమాల లిస్ట్ ఇదే.. ఓజీ ర్యాంక్ ఎంతంటే..?

టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ ఓజీ. నిన్న గ్రాండ్ లెవెల్ లో పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజై దూసుకుపోతున్న సంగతి తెలిసింది. అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి యుఎస్ లో ఓజీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీన్నిబట్టి.. అభిమానుల సినిమా పై ఏ రేంజ్‌లో హైప్‌ క్రియేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే.. ఓజీ మూవీ ప్రీమియర్స్‌కు భారీ కలెక్షన్స్ వచ్చాయి. మంచి రెస్పాన్స్ దక్కింది. రిలీజ్‌కు ముందే ఓజీ ప్రీమియర్ కలెక్షన్స్ నెటింట‌ సంచలనంగా మారాయి. ఫస్ట్ డే ఫ్యాన్స్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక నార్త్‌ అమెరికాలో ప్రిమియ‌ర్స్ ముగియ‌క ముందే.. ఓజీ మిలియన్ డాలర్ల వ‌సూళ్ల‌ను అందుకోవడం విశేషం.

 

చివరికి అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే మూడు మిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది. ఇది పవన్ కెరీర్‌లోనే రేర్ రికార్డ్. అంతే కాదు.. టాలీవుడ్ రికార్డ్‌లోనే స్పెషల్ రికార్డ్. ఈ క్రమంలోనే.. గతంలోనూ కలుపుకొని కొన్ని పెద్ద సినిమాలు ప్రీమియర్స్‌లో సాధించిన రికార్డులు తెగ ట్రెండింగ్‌గా మారుతున్నాయి. ఆర్‌ఆర్ఆర్, పుష్ప2, దేవ‌ర‌, కల్కి లాంటి సినిమాలు యూఎస్‌లో భారీ వ‌సూళ్ల‌ను దక్కించుకున్నాయి. వాటి జాబితాలో.. ఇప్పుడు నాలుగో స్థానంలో నిలవడం విశేషం. అమెరికన్ మార్కెట్లో ప్రీమియర్ షో రెస్పాన్స్ ఎప్పుడు స్పెషల్ గానే ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి.. 3.9 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలవగా.. రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రీమియర్స్ లో 3.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఇక పుష్ప 2.. 3.34 మిలియన్ డాలర్లతో మూడ‌వ‌ స్థానాన్ని సొంతం చేసుకుంది. అయితే నాలుగో స్థానంలో ఓజీ.. 3 డాలర్లను దక్కించుకుంది.

ఎన్టీఆర్ దేవర 2.85 మిలియన్ డాలర్లతో 5వ స్థానంలో నిలిచింది. ఇక.. ఓజీ సంపాదించిన ఈ నాలుగవ‌ స్థానం ఇప్పటిది కాదు.. రిలీజ్‌కు ముందు రోజే ఈ రేంజ్ లో వసూళ్ల‌ను కొల్లగొట్టడం విశేషం. ప్రీమియర్స్‌ ద్వారా.. ఈ లెవెల్లో వసూళ్లు వచ్చాయి అంటే.. పవన్ ఓజీ ఫివర్.. ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ప్రీమియర్ కలెక్షన్ కు పండగ వాతావరణం నెలకొంది. ఇక సినిమా ఫస్ట్ డే థియేటర్‌లో మాస్ రెస్పాన్స్‌తో దుమ్ము దులిపేసింది. సినిమాపై పాజిటివ్ టాక్‌ రావడంతో ఆడియన్స్ క్యూ కట్టారు. ఈ క్రమంలోనే మొదటి రోజు ఓజీ.. పాన్ వరల్డ్ లెవెల్‌లో ఏకంగా రూ.127 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టిందని మేకర్స్ పోస్టర్ ద్వారా అఫీషియల్గా వెల్లడించారు. ఇక ఫుల్ లెవెల్ లో దసరా హాలిడేస్ ప్రారంభమైతే సినిమా నెక్స్ట్ లెవెల్ లో రికార్డులు కొల్లగొడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.