బాలయ్య వర్సెస్ చిరు వార్.. పవన్ స్టెప్ ఎటువైపు..!

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న వివాదం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా.. బాలకృష్ణ, చిరంజీవి ప్రకటనలు నెటింట‌ హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలోనే.. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. పవన్ అడుగు.. అన్న చిరు వైపు ఉంటుందా.. లేదా కూటమి కీలక ఎమ్మెల్యే.. బాలకృష్ణ వ్యాఖ్యలకు సపోర్టుగా నిలుస్తాడా తెలియాల్సి ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. నిన్న బాలయ్య అసెంబ్లీ వేదికగా సినీనటులకు అవమానం జరిగిందన్నమాట వాస్తవం. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ వచ్చి కలిసారు అనేది పూర్తిగా అబద్ధం అంటూ చెప్పుకొచ్చాడు. అప్పట్లో జగన్‌ను ఎవరు గట్టిగా అడగలేదని.. ఇండస్ట్రీ పెద్దలు కలవడానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి కలవడు.. సినిమాటోగ్రఫీ మంత్రి మీతో మాట్లాడతారు అన్నారని.. అప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితే సీఎం దిగి వచ్చి కలిసారు అన్నది అబద్ధం.. దాన్ని నేను ఖండిస్తున్న అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశాడు.

ముఖ్యమంత్రిని కలిసేందుకు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన జాబితాలో ఆయన పేరు 9వ స్థానంలో వేశారని.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరు అలా వేశారు అన్నది సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్‌ను అడిగా. ఇదేనా వ్యక్తులకు ఇచ్చే గౌరవం అంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యాడు. దీనిపై చిరంజీవి రియాక్ట్ అవుతూ… వైసిపి హ‌యాంలో సినిమా టికెట్ ధరల పెంపు కోసం తను చేసిన ప్రయత్నాలు, పరిణామాలను వివరిస్తూ అనౌన్స్మెంట్ ను రిలీజ్ చేశాడు. అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, దర్శకులు, చలనచిత్రం మండలి ప్రతినిధులు నన్ను కలిసి టికెట్ల ధరల పెంపు కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవాలని కోరారు. వారి సూచన మేరకు నేను అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో మాట్లాడా అంటూ చిరంజీవి వివరించాడు. తర్వాత మంత్రి పేర్ని నాని పిలుపుమేరకు ముఖ్యమంత్రిని కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న టైంలో బాలయ్యను సంప్రదించాన‌ని.. ఫోన్లో ప్రయత్నించాను కానీ.. ఆయన అందుబాటులోకి రాలేదంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు.

Balakrishna vs Chiranjeevi sparks row in AP

నిర్మాత జెమినీ కిరణ్ కూడా ప్రయత్నించిన బాలయ్యను కలవలేకపోయారని చెప్పుకొచ్చాడు. దీంతో ఆర్. నారాయణ మూర్తి సహా.. కొందరి సిని ప్రముఖులతో కలిసి జగన్ను కలిసి సినీ ఇండస్ట్రీకి సహకారం అందించాలని కోరామని వివరించాడు. తను తీసుకున్న చొరవతోనే అప్పట్లో ప్రభుత్వం సినిమా టికెట్ల పెంపకం అంగీకారం తెల్పింది.. ధరలు పెరగడానికి కారణమైందంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. ఈ పెంపు నిర్మాతలకు, పంపిణీదారులకు, ప్రదర్శన కార్మికుల‌కు లాభాలు చేకూర్చిందంటూ ఆయన వివరించాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న క్రమంలో ఓ అనౌన్స్మెంట్ ద్వారా నిజాన్ని తెలియజేస్తున్న అంటూ చిరంజీవి వీడియోలో క్లారిటీ ఇచ్చాడు. అయితే.. కేవలం ఈ వీడియోలో చిరంజీవి క్లారిటీ మాత్రమే ఇచ్చాడు. దీనిలో బాలయ్య, చిరంజీవి మ‌ధ్య వాదం జరిగిందనేది అవాస్తవం.

Chiranjeevi: We will always be indebted to Rajamouli - TeluguBulletin.com

ఆరోజు ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన టైం లో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో చర్చి మొదలైంది.. చిరంజీవికి అవమానం జరిగిందని కామినేని ప్రస్తావించడంతో.. దానికి కౌంటర్గా బాలయ్య గతంలో సంగతులను గుర్తు చేశారు. తన పేరును చివరన పెట్టారని ఆయన ప్రశ్నించాడు. ఇందులో నేరుగా చిరంజీవిపై బాలయ్య ఎలాంటి కామెంట్లు చేసింది లేదు. నాటి పరిణామాలను మాత్రమే ఆయన అసెంబ్లీలో వివరించాడు. చిరంజీవి సైతం నాడు.. ఆ ముఖ్యమంత్రిని కలిసి జరిగిన పరిణామాలకు వివరణ ఇచ్చాడు. ఇందులో ఎవరికి అవమానం జరిగింది లేదు. వాళ్ళు పిలిచిన మేరకు వెళ్ళామని అక్కడ సరైన ప్రాధాన్యత దక్కిందని చిరంజీవి వివరించాడు. ఈ చిన్న మ్యాట‌ర్‌.. అసలు ఎవరు ఎవరిని అనుకోని ఈ సంఘటనలను.. మీడియా, సోషల్ మీడియాలు కొన్ని హైలెట్ చేస్తూ ట్రోల్స్ చేయడంతో.. ఇది వైరల్ గా మారింది. దీనిపై పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.