” ఓజీ “ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ క్రేజీ రికార్డ్స్ వెయిటింగ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. సాధారణంగా పవన్ సినిమాకు సంబంధించిన ఏ సినిమా కలక్షన్ విషయంలోనూ అఫీషియల్ అనౌన్స్మెంట్లు వచ్చిందే లేదు. కానీ.. ఓజీ విషయంలో మాత్రం ఓవర్సీస్‌లో ప్రీమియర్ లెక్కలను మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. అలా.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో పవన్ రికార్డ్‌లు నెటింట తెగ వైరల్‌గా మారాయి.

ఈ క్ర‌మంలోనే తాజాగా పవన్ మూవీ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు తెగ వైర‌ల్‌ అవుతున్నాయి. అంతేకాదు.. త్వరలోనే పవన్ ఖాతాలో మరిన్ని రికార్డులు పడడం ఖాయం అంటూ టాక్‌ నడుస్తుంది. ఓజి ప్రిమియ‌ర్ క‌లెక్ష‌న్స్ కలుపుకొని ఓజీ.. పాన్ ఇండియా లెవెల్లో రూ.91.25 కోట్ల నెట్ వ‌సూళ్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ అనలిస్ట్ సాక్నెల్క్ నివేదికలో వెల్లడించింది. ప్రీమియర్ షోలకు రూ.20 కోట్లు, ఫస్ట్ డే షోలకు రూ.70 కోట్ల వరకు నెట్ వసూలు వచ్చినట్లు సమాచారం. ఇక ఓజీ.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.167 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. పవన్ కెరీర్‌లోనే ఇది ఆల్ టైం రికార్డ్.

ఓవర్సీస్.. నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్ షోలోనే మూడు మిలియన్ డాలర్లు అంటే రూ.26 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు మూవీ టీం గతంలోనే అఫీషియల్ గా వెల్లడించారు. ఇక వీటిని ఫస్ట్ డే వ‌సూళ్ల‌తో కలుపుకుంటే.. రూ.167 కోట్లకు పవన్ ఓజి చేరుకుందట. తెలుగులో 69.35% ఆక్యుపెన్సీ ఉండగా.. తమిళ్‌లో 18.36% హిందీలో 10.37% అక్యుపెన్సీ వ‌చ్చింది. ఇక.. ఏరియా వైడ్‌ గా నైజం ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్‌తో అదరగొట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏకంగా రూ.24 కోట్ల షేర్ అందుకున్నట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం.. పవన్ కెరీర్‌లోనే హైయెస్ట్ రేంజ్‌ వసూళ్లు.. ఈ సినిమాతో దక్కించుకున్నాడని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. వీకెండ్ వస్తున్న క్రమంలో కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.