సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారి సక్సెస్ వస్తే.. స్టార్ ఇమేజ్, అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ కామన్‌గా వచ్చేస్తూ ఉంటుంది. అయితే.. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కొందరికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించడమే కాదు.. సాధారణ ప్రేక్షకులతో పాటు.. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులను కూడా తమ ఫ్యాన్స్ గా మార్చేసుకునే సత్తా చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉంటుంది. సగటు ఫ్యాన్స్ లాగే.. సెలబ్రిటీలను ఎగ్జిట్ చేసే హీరోల్లో పవన్ కళ్యాణ్ మొదటి వరుసలో ఉంటాడు. మొదట మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ అని ట్యాగ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన.. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అనే రేంజ్‌కు ఎదిగాడు.
తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలతో అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసిన రికార్డ్ పవన్‌కు సొంతం. ఇక.. అదే సమయంలో సాధారణ యూత్‌లా ఉన్న చాలామంది సెలబ్రిటీస్.. తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటినట్లుగా, దర్శకులుగా, సాంకేతిక నిప్పులుగా మారి సక్సెస్ అందుకున్నారు. వాళ్లంతా ఇప్పటికీ పవన్ పేరు చెబితే చాలు ఉత్సాహంతో ఊగిపోతారు. ఇక పవన్ నుంచి ఓ మూవీ వచ్చి పాజిటివ్ టాక్ వస్తుందంటే చాలు.. ఈ సెలబ్రిటీస్ అంతా సాధరణ ఆడియన్స్‌లా మారిపోయి.. తమ రివ్యూలను తెలియజేస్తారు. ఇప్పుడు ఓజీ సినిమా మరోసారి వీళ్ళందరిలోను ఫ్యాన్ బాయ్ ని తట్టి లేపింది. నిన్న హైదరాబాద్‌లో అత్యధిక సంఖ్యలో ప్రీమియర్ షోస్ పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చాలా చోట్ల థియేటర్లు సెలబ్రిటీలతో నిండిపోయాయి. ఏఎంబి, ప్రసాద్ మల్టీప్లెక్స్, విమల్ థియేటర్లు సెలబ్రిటీలతో కళకళలాడాయి.
వారిలో ప్రొడ్యూసర్లు దిల్ రాజు, నాగ వంశీ, ఎస్కేఎన్ ఓజి షర్ట్లు వేసుకుని థియేటర్లకు వచ్చి సందడి చేశారు. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, కొరటాల శివ సైతం బిగ్ స్క్రీన్ పై సినిమా చూసి ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియాలో అయితే.. పవన్ అన్న చిరంజీవి.. తమ్ముడు సక్సెస్‌ను ప్రశంసిస్తూ.. ఆనందంతో పోస్ట్ చేశాడు. ఇక మెగా హీరోలు చాలామంది తాము సెలబ్రిటీస్ అని మర్చిపోయి.. సాధారణ ఆడియన్స్‌లా థియేటర్లకు వెళ్లి తెగ ఎంజాయ్ చేస్తూ సినిమాను వీక్షించారు. తర్వాత.. తమ రివ్యూలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ బాబి సైతం సినిమా చూసి తమ ఎక్స్‌పీరియన్స్‌ను అందరితో పంచుకున్నారు. ఇలా.. పవన్‌కు ఒక్క హీట్ వస్తే.. ఇండస్ట్రీ మొత్తం ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇతర హీరోల అభిమానుల సైతం ఈ సినిమాను ఎంజాయ్ చేయడం విశేషం. ఇలాంటి క్రేజ్ మంచి ఇమేజ్ చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే దక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.