ఎడిటింగ్‌లో తీసేసిన నేహా స్పెషల్ సాంగ్.. ఓజీపై కొత్త చర్చ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ స్టార్ డ్రామా “ఓజీ” భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కి ముందు నుంచే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా, అంచనాలను అందుకొని థియేటర్లలో దుమ్మురేపుతోంది. పవన్ ఫ్యాన్స్ ఎంతో కాలం తర్వాత కిక్కిచ్చే సినిమా వచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ స్టైల్, యాక్షన్, ఎంట్రీ సీన్స్, డైలాగ్స్ – అన్నీ థియేటర్లలో మంటలు రేప‌యి. పవన్ కళ్యాణ్ ను ఒక కొత్త అవతారంలో చూపించాలనే సుజీత్ ప్లాన్ 100% సక్సెస్ అయ్యిందని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. స్టైలిష్ గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ పవర్ ఫుల్‌గా కనిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం పీక్‌కి చేరింది.

ముఖ్యంగా మాస్ సీన్స్, ఎలివేషన్స్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి థియేటర్లలో పండగ వాతావరణాన్ని సృష్టించాయి. అయితే ఈ మాస్ ఫెస్టివల్ మధ్యలో ఫ్యాన్స్ కి ఒక చిన్న నిరాశ ఎదురైంది. అదేంటంటే.. ఈ సినిమాలో ‘డీజీ టిల్లు’ బ్యూటీ నేహా శెట్టి స్పెషల్ సాంగ్ లేకపోవడం. విడుదలకు ముందు నుంచే నేహా ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిపోతుందని వార్తలు వచ్చాయి. ఓ ఈవెంట్‌లో కూడా నేహా స్వయంగా ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి. కానీ సినిమా థియేటర్స్‌లో రిలీజైన తర్వాత ఆ పాట ఎక్కడా కనిపించకపోవడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, నేహా పాట షూట్ చేసినప్పటికీ, ఫైనల్ ఎడిటింగ్‌లో తీసివేసినట్లు తెలుస్తోంది. కారణాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు. గ్యాంగ్ స్టార్ డ్రామా మూడ్‌ను కాపాడేందుకా? లేక రన్‌టైమ్ తగ్గించేందుకా? అన్నది క్లారిటీ లేదు. కానీ, ఒక విషయం మాత్రం ఖాయం – నేహా పాట మిస్సవ్వడంతో కొంతమంది ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయినా కూడా, “ఓజీ”లో పవన్ మాస్ ఎంట్రీలు, యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ హైలైట్స్ అన్నీ ఫ్యాన్స్ కి పక్కా ఫీస్ట్ అందించాయి. ఇక నేహా పాట లేనప్పటికీ, సినిమా క్రేజ్ మీద ఎలాంటి ప్రభావం పడలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, పవన్ తన పవర్ తో మళ్లీ థియేటర్స్ లో జోష్ నింపాడు కానీ, నేహా సాంగ్ లేకపోవడం మాత్రం అభిమానులకు ఒక మిస్ అయిపోయింది.