ప్రస్తుతం ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మానియా కొనసాగుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓజీ ఫీవర్ అమలాపురం టు డల్లాస్, దుబాయ్ వరకు పాకిపోయింది. ఎక్కడ చూసినా థియేటర్లలో ఓజీ సినిమానే కనబడుతుంది. పవన్ పేరు మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే సినిమా కొద్దిసేపటి క్రితం ప్రీమియర్ షోస్ సైతం ముగించుకుంది. అయితే.. సినిమా రిలీజ్‌కు ముందే.. అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపించి రికార్డు లెవెల్ లో నంబర్స్ నమోదు చేసుకుంటుంది. అలా థియేటర్లో ఫస్ట్ షో పడకముందే.. పవన్ వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్‌తో 100 కోట్ల క్లబ్ లోకి చేరి సంచలనం సృష్టించారు.
సినిమా ప్రీమియర్స్ కూడా పడకముందే ఓజీ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం విశేషం. వరల్డ్ వైడ్‌గా మూవీ ప్రీ సేల్స్ రూ.100 కోట్లను దాటేసింది. అమెరికాలో ఓజీ దూకుడు ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. మూడున్నర మిలియన్ డాలర్ల మార్క్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. తెలుగు గ్రాస్ ప్రకారం రూ.35 కోట్లను ఖాతాలో వేసుకుంది. ఇక తెలంగాణ.. హైదరాబాద్‌లో భారీ లెవెల్లో ప్రీమియర్స్ పడ్డాయి. ఈ క్రమంలోనే పవన్ కెరీర్‌లోనే క్రేజి రికార్డ్ సొంతమైంది. అలా.. ప్రీమియర్స్ పడకముందే.. మూవీ ఫ్రీ సేల్స్ ద్వారా రూ.20 కోట్లను దక్కించుకుంది. నైజం.. ఓజీ అయితే ఇప్పటికే.. రూ.30 కోట్లకు పైగా దక్కించుకోవడం విశేషం.
కేవలం హైదరాబాద్ సిటీ లోనే.. రూ.20 కోట్ల ఓపెన్ బుకింగ్స్ వచ్చామంటే.. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ లెవెల్‌లో ఉందో తెలుసుకోవచ్చు. ఏపీలోనూ పలుచోట్ల ఓజీ ప్రీమియర్ షోస్ ముగించుకుంది. ఇక.. అక్కడ కూడా కలెక్షన్లు రూ.30 కోట్ల వరకు సొంతమైనట్లు సమాచారం. అలా.. ప్రీమియర్ షోస్ పడక ముందే.. ఓజీ ఫ్రీ సేల్స్ ద్వారా రూ.100కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి.. రికార్డు క్రియేట్ చేసింది. ఇక సినిమా టాక్ ఎలా ఉన్నా.. ఫస్ట్ హాఫ్ మాత్రం రికార్డు లెవెల్ లో ఓజి కలెక్షన్లు కల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా సినిమా నిల్వనుందట. ఫస్ట్ టైం పవన్ మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డ్ ఓజీకి దక్కనుంది. ఇక ఈ సినిమా హాలిడే సీజన్ కావడం, టికెట్ హైక్ ఇవన్నీ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. ఈ క్రమంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ పెద్ద కష్టం కాదు.