ఓజీలో ఆఖీరా నందన్ ను గమనించారా.. ట్రైలర్ తో హింట్ ఇచ్చారుగా..!

ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం ఓజీ మానియా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా పవన్, సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ పైనే చర్చలు కొనసాగుతున్నాయి. ఇక అభిమానులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసిన ట్రైలర్ కొద్ది గంట‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలో.. పవన్ కళ్యాణ్ ఫుల్ ఆఫ్ యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. తాజాగా.. ఒక చేత్తో గన్‌.. మరో చేత్తో కత్తి పట్టుకుని వేటకు బయలుదేరా సింహం లా ఉగ్రరూపాన్ని చూపించాడు పవన్. ఈ క్రమంలోనే ట్రైలర్ అంచనలను పెంచేసింది. రిలీజైన 5 గంటల్లోనే.. 50 లక్షలకు పైగా వ్యూస్, 6 లక్షలకు పైగా లైక్స్ ద‌క్కించుకుంది. దీంతో.. పవన్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్‌ సినిమాపై అంతకంత‌కు హైప్ పెంచుకుంటూ పోతున్నాయి. అయితే.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కావడంతో సినిమాపై మరింత బ‌జ్ పెరిగింది. ఇలాంటి క్రమంలో సోషల్ మీడియాలో మరో న్యూస్ వైరల్ గా మారుతుంది. ఒజీలో పవన్ కుమారుడు అకీరా కూడా ఉన్నాడని.. ట్రైలర్లో మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారని.. అంటున్నారు. పవన్ ఫ్యాన్స్ దాని కనిపెట్టారా.. లేదా.. ఇంతకీ అకీరాకు సంబంధించిన ఆ షార్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. పవన్.. పదహారేళ్ళ వయసులో ఉన్న సీన్స్ ఆకీరతోనే మేకర్స్‌ చేపించినట్లు సమాచారం. ఇదే వాస్తవం అయితే.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వ‌డం ఖాయం.

ట్రైలర్‌లో.. పవన్, ఇమ్రాన్ హష్మీకి ఫోన్ చేసి ముంబై వస్తున్నా.. తలలు తీసుకెళ్తా అని చెప్పిన తర్వాత.. చేతిలో కత్తి పట్టుకుని కిందకి నడుచుకుంటూ వచ్చే ఒక షార్ట్ అందరు గుర్తించే ఉంటారు. అది ఆఖీరానందన్ కళ్ళకు సంబంధించిన షార్ట్ అని.. నెటింట టాక్ తెగ ట్రెండింగ్‌గా మారింది. ఇదే వాస్తవమైతే.. ఫ్యాన్స్‌కు డబల్ బోనాంజా అవుతుంద‌న‌టంలో సందేహం లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత గాని.. దీనిపై ఎలాంటి క్లారిటీ రాదు. ఇక తాజాగా సెన్సార్ పూర్తిచేసుకుని 154 నిమిషాల రన్ టైంతో రిలీజ్‌కు రెడ్డీ అవుతున్న ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ద‌క్క‌డంతో పవన్ అభిమానుల్లో అంచనాలు డబల్ అయిపోయాయి. ఫుల్ ఆఫ్ యాక్షన్ అవతారని చూడొచ్చని.. స్క్రీన్ పై పవన్ బ్లడ్ బాత్ ఫిస్ట్ లా ఉంటుందంటూ మరిన్ని అంచనాలను పెట్టుకుంటున్నారు ఫ్యాన్స్. సెప్టెంబర్ 25న సినిమా రిలీజై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.