రిలీజ్ కి ముందే ” ఓజీ ” కి బిగ్ షాక్.. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ. పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు.. ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా.. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెరవనున్నారు. సుజిత్ డైరెక్షన్‌లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య‌ సినిమాను నిర్మించారు. మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్‌లో సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై ఇప్పటికే పీక్స్‌ లెవెల్‌లో హైప్‌ మొదలైపోయింది.

ఇక కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. సినిమాపై రోజురోజుకు ప్రమోషన్ చేస్తూ మరింత హైప్ పెంచేస్తున్నారు మేక‌ర్స్‌. సినిమాకు ప్రీమియర్ షో సైతం ప్లాన్ చేశారు. ఇప్పటికే అన్ని చోట్ల ఓపెన్ బుకింగ్స్ ప్రారంభమై కలెక్షన్లతో సంచలనాలు సృష్టిస్తుంది. ఇక సినిమా రిలీజ్ కోసం అన్ని పనులను పూర్తి చేసిన మేకర్స్.. ఇందులో భాగంగానే.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వర్షం రావడంతో టీంకు ఈవెంట్ లోనే బిగ్ షాక్‌ తగిలింది.

దీనివల్ల.. లక్షల్లో లాస్ వచ్చింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ సైతం డిసప్పాయింట్ అయినా.. ఒక్క విషయంలో మాత్రం ఫుల్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే.. పవన్ కళ్యాణ్ స్పీచ్. అంత వర్షంలోనూ పవన్ మాట్లాడడం.. దాన్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. వర్షం వ‌ల్ల ఈవెంట్ అనుకున్న రేంజ్ లో సక్సెస్ చేయకపోయినా.. పవన్ మాట్లాడడానికి మాత్రం కారణమైంది. పవన్ ఈవెంట్‌లో ఇచ్చిన స్పీచ్.. ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించింది. ఈ క్రమంలోనే ఓజీకి బిగ్ షాక్ తగిలినా.. పవన్‌ స్పీచ్ మాత్రం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కల్పించింది.