” ఓజీ ” టికెట్ రేట్స్ హైక్.. బెనిఫిట్ షో కాస్ట్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంకా అరుళ్‌ మోహన్ జంట‌గా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విల‌న్ పాత్ర‌లో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజాత డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరో ఎనిమిది రోజుల్లో పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కారుంది. ఇక ఇప్పటికే సినిమాపై పవన్ అభిమానులతో పాటు.. ఆడియన్స్‌లోను భారీ హైప్ మొదలైంది. ఈ క్రమంలోను ఓవర్సీస్‌లో సినిమా బుకింగ్స్ మొదలై జోరుగా కొనసాగుతున్నాయి. ఇంకా సినిమాకు 8 రోజుల టైం మిగిలి ఉండగానే.. సినిమా రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ దాటి సంచ‌ల‌నం సృష్టించింది.

ఇక ఫుల్ లెవెల్‌లో ఓవర్సీస్ అడ్వాన్స్‌ బుకింగ్స్ మొదలై.. తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్ ప్రారంభం అయితే.. ఓజి సెన్సెష‌న్‌ మరో లెవెల్‌లో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఓజీ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కచ్చితంగా నాలుగైదు రోజుల్లో రూ.500 కోట్ల చేరువకు సినిమా వెళ్లడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్లుగానే తెలంగాణ, ఆంధ్రాలో టికెట్ రేట్ల హైక్ కోసం గవర్నమెంట్‌ను అప్రోచ్‌ అయ్యారు ఓజి మేకర్స్. ఇక ప్రస్తుతం ప‌వ‌న్ ఆంధ్రప్రదేశ్ ఏపీ డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సినిమాకు వెంటనే హైక్ వచ్చేసింది.

పవన్ ఓజి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ అనుమతులు జారీ చేసింది. ఈ నెల 25న రిలీజ్ కనున్న క్ర‌మంలో.. బెనిఫిట్ షో.. 25 తారీకు అర్ధరాత్రి ఒంటిగంటకు.. టికెట్ కాస్ట్‌ రూ.1000కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్ అయితే రూ.125 గాను, మల్టీప్లెక్స్ లో అయితే రూ.150 పెంచుకోవచ్చని పర్మిషన్ జారీ చేసింది. 25 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు అంటే పది రోజుల పాటు టికెట్ రేట్లు అమలు చేసుకోవచ్చని జీవో పాస్ చేశారు. ప్రస్తుతం ఈ జీవో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో.. పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ తగిలినట్టు అయింది. ఏకంగా టికెట్ కు రూ.1000 పెంచడంతో మేకర్స్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా రూ.1000 ఖర్చు చేసి టికెట్ కొని.. సినిమా చూడడం అంటే పవన్ ఫ్యాన్స్ కు కూడా చాలా కష్టం అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.