టాలీవుడ్ సీనియర్ ముద్దుగుమ్మ మీనా అందం, అమాయకత్వం కలబోసిన అద్భుతమైన రూపం బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఎలేసింది. ఇప్పటికి పలు సీనియర్ స్టార్ హీరోల సినిమాలో హీరోయిన్గా మెరుస్తూనే ఉంది. ఇలాంటి క్రమంలో జగపతిబాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేసింది. ఎన్నో విషయాలను పంచుకుంది. ఇక హీరోయిన్ సౌందర్యను గుర్తుతెచ్చుకొని ఎమోషనల్ అయింది.
సౌందర్య, నేను మొదటి నుంచి చాలా క్లోజ్. తను చాలా మంచి అమ్మాయి. తను క్యాంపైన్‌కు వెళ్లి చనిపోవడం నాకు చాలా బాధ కల్పించింది. నిజానికి.. ఆ క్యాంపైన్‌కు నన్ను కూడా ఆహ్వానించారు. కానీ.. నేను షూట్స్ బిజీ తో ఉండడం, పైగా క్యాంపైన్స్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండవు.. ఈ క్రమంలోనే నేను దాన్ని స్కిప్ చేశా. లేదంటే అప్పుడే తనతో పాటు నేను చనిపోయి ఉండాల్సింది. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో తనను కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నా అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇక మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్ 28న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో మీనా పై వచ్చిన రూమర్స్ చూసి తాను ఎంతగానో కృంగిపోయాను అంటూ వివరించింది.
నా భర్తను కోల్పోయిన బాధ నుంచి నేను రెండేళ్లపాటు బయటపడలేకపోయా. నన్ను నా ఫ్రెండ్స్ ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్న నేను చాలా లక్కీ అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. నా భర్త చనిపోయిన వారానికే నాకు ఇంకో పెళ్లి చేసేసారని.. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నానంటూ పిచ్చి వార్తలు రాశారని.. వాళ్ళకు అసలు మనసు ఉండదా.. ఫ్యామిలీ ఉండదా.. అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. తర్వాత కూడా ఆ రూమర్స్ కంటిన్యూ చేశారు. ఎవరికి విడాకులైన వారితో నా పెళ్లి జరుగుతుందని రాసేశారు. బాధలో ఉన్న నన్ను మరింత బాధ పెట్టారు అంటూ వివరించింది. ఈ క్రమంలోనే మీనా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఈ షో ఫుల్ ఎపిసోడ్ జి ఫైవ్ లో చూడొచ్చు.