టాలీవుడ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన ఈ సినిమాతో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాడు. హనుమాన్‌ని మించిపోయే రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ సైతం తమ రివ్యూ షేర్ చేసుకుంటున్నారు. మీడియం రేంజ్ టైర్ 2 హీరోల విషయంలో ఇండస్ట్రియల్ ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. అది కూడా సినిమా రిలీజ్ అయిన 2వ రోజే మిరాయ్ ఈ రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇక ఈ సినిమా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.8.20 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. టైర్ 2 హీరోలుగా ఉన్న నాచురల్ స్టార్ నాని.. హిట్ 3, శ్యామ్ సింగరాయ్, దసరా.. విజయ్ దేవరకొండ నటించిన ఖుషి, కింగ్డమ్, గీతగోవిందం, నాగచైతన్య.. తండేల్, లవ్ స్టోరీ, మజిలీ లాంటి సినిమాల రికార్డులు అన్నిటిని తుక్కుతుక్కు చేసి మిరాయ్ రెండవ రోజు ఈ రేంజ్‌లో కలెక్షన్లను దక్కించుకోవడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తుంది. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లు కొల్లగొట్టిన మీడియం సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది మిరాయ్.
ఈ సినిమాల్లో తేజ నటనకు ప్రశంసల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా అద్భుతమైన పర్ఫామెన్స్, కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. అన్ని భాషల్లోనూ తేజ పర్ఫామెన్స్‌కు యునానిమస్‌గా పాజిటివ్ రివ్యూలు దక్కడం విశేషం. ఈ దెబ్బతో టైర్ 2 హీరోలలో తేజా సజ్జా నెంబర్ వన్ పొజిషన్‌కు చేరిపోయినట్లే అంటూ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.55 కోట్ల మేర గ్రాస్ కొల్లగొట్టింది. ఇక ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.. ఫుల్ రన్‌లో ఏ రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతుందో వేచి చూడాలి.