టాలీవుడ్ ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని.. బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో దూసుకుపోతున్న స్టార్ హీరోలు అతితక్కువ మంది ఉన్నారు. వారిలో మొదట మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తుంది. గత 50 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్‌లో రాణిస్తున్న ఈయన.. ఇప్పటికీ తన నటనతో ఎనర్జీతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఇక మెగాస్టార్ లాంటి ఓ స్టార్ హీరో తనతో పాటు.. తన తమ్ముడిని కూడా హీరోగా చేయాలని భావించడం కామన్. కానీ.. పవన్‌ను సినీ ఇండస్ట్రీకి తీసుకురావడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఈవివి సత్యనారాయణ డైరెక్షన్‌లో అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.. అనే సినిమాను పవన్ నటించాడు. అయితే.. ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
దీనికి పవన్ కాస్త నిరాశ చెందినా.. పవన్ డైరెక్టర్ ఈవివి గారితో పాటు.. ప్రొడ్యూసర్‌కు సైతం క్షమాపణలు చెప్పాడట. కారణమేంటంటే.. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇప్పిస్తున్న క్రమంలో.. ఈ సినిమాకు పెద్దగా హైప్‌ను క్రియేట్ చేసే ప్రయత్నాలు చేశారు. దాంతో పాట్టే.. నాగేశ్వరరావు గారి మనవరాలు అయిన సుప్రియ ఇందులో హీరోయిన్గా నటిస్తోందని.. మెగాస్టార్ తమ్ముడు హీరోగా చేస్తున్నాడు అంటూ భారీ హెడ్డింగ్స్.. విచ్చలవిడిగా ప్రమోషన్స్ చేసి సినిమాపై విపరీతమైన క్రేజ్ పెంచేశారు. దీంతో ఈ సినిమా కథ బాగానే ఉన్నా.. ఆడియన్స్ లో ఉన్న భారీ అంచనాలను రీచ్ కాలేక సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది.
దీంతో.. దర్శక, నిర్మాతలకు క్షమాపణలు చెప్పిన పవన్.. తర్వాత సినిమాలు చేయడానికి కాస్త ఆలోచించాడట. ఓ రకంగా ఈ సినిమాకు ఈ రేంజ్ లో హైన్ క్రియేట్ చేయడానికి ప్రధాన కారణం చిరంజీవినే అంటూ అప్పట్లో తెగ వార్తలు వైరల్ అయ్యాయి. కారణం చిరు సైతం తన సొంత తమ్ముడి సినిమా అంటే.. నెక్స్ట్ లెవల్లో ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో భారీగా సినిమాపై హైప్ పెంచేశారు. చిరంజీవి చేసిన ఆ మిస్టేక్ కారణంగానే పవన్ కళ్యాణ్ డిజాస్టర్ ఎదురుకోవాల్సి వచ్చిందని.. దర్శక, నిర్మాతలకు సారీ చెప్పాల్సి వచ్చిందని రకరకాల వార్తలు వైరల్ గా మారాయి. అలాంటి పవన్ ఇప్పుడు అన్నకు తగ్గ తమ్ముడు గా పవర్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. మరోపక్క రాజకీయాలను సక్సెస్ అందుకుని.. ఏపీ డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టి బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.