చిరు ఛీ కొట్టిన‌ క‌థ‌లో న‌టించి డిజాస్ట‌ర్ మూట‌క‌ట్టుకున్న తార‌క్‌.. ఆ మూవీ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ గాడ్ ఫాదర్గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం తన నిర్ణయంతోనే కాదు.. డ్యాన్స్‌తోను బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న చిరు.. ఏడు న‌దుల‌ వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తు ఆకట్టుకుంటున్నాడు. ఇక తన సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించిన చిరు.. ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులో ఉన్న సంగతి తెలిసిందే. విశ్వంభర తో పాటు.. మన శంకర వ‌రప్రసాద్ గారు సినిమాలు త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు.. బాబీ డైరెక్షన్లో మరోసారి చిరంజీవి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. శ్రీకాంత్ ఓద్దెల‌తో మెగాస్టార్ మరో ప్రాజెక్ట్ లో నటించనున్నాడు.
Happy Birthday Megastar Chiranjeevi sir Do follow @tarakism_tollywoods  #jrntr #megastarchiranjeevi #jaintr #ntr #ntrfans #ntrarmy #ntrfansclub  #ntrjr #youngtigerntr #jrntrfansclub #jrntrofficial #ntramarao  #telugufilmnagar #tollywood #bollywood ...
కాగా ఈ రేంజ్‌లో మెగాస్టార్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడానికి ఆయన ఎంచుకునే కథలు కూడా ఒక ప్రధాన కారణం. ఈ క్రమంలోనే కంటెంట్ నచ్చక, ఇత‌ర ఇత‌ర‌ కార‌ణాల‌తో ఎన్నో కథలను చిరు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా గతంలో చిరంజీవి రిజెక్ట్ చేసిన ఓ కథలో ఎన్టీఆర్ నటించి ఘోరమైన డిజాస్టర్ ను మూట కట్టుకున్నాడంటూ టాక్‌ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి.. చిరంజీవి రిజెక్ట్ చేయడానికి కారణమేంటి.. తారక ప్రాజెక్టులో ఎలా ఎంట్రీ ఇచ్చాడు.. ఒకసారి తెలుసుకుందాం. ఆ మూవీ మరేదో కాదు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెర‌కెక్కిన ఆంధ్రవాల‌. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ కి ముందే ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ నెలకొల్పింది. కేవలం సినిమా ఆడియో ఫంక్షన్‌కి లక్షలాదిమంది అభిమానులు వచ్చి సందడి చేశారంటే.. అప్పట్లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Andhrawala | Cast & Crew | News | Galleries | Movie Posters | Watch  Andhrawala Movie Online
ఇక ఇప్పటికి ఆ రికార్డును ఎవరు టచ్ చేయలేకపోయారు. ఈ రేంజ్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఆంధ్రావాలా.. ఆడియన్స్‌ను మాత్రం అసలు ఆకట్టుకోలేకపోయింది. కాగా.. మొదట ఈ సినిమాను పూరి జగన్నాథ్‌ చిరంజీవితో చేయాలని భావించాడట. ఆయనకు కథ కూడా వినిపించాడట. అయితే.. మెగాస్టార్ చేతిలో పలు సినిమాలు ఉండడం.. అలాగే కంటెంట్ పై కూడా డౌట్ తో.. చిరు సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశాడు. దీంతో పూరి జగన్నాథ్ తన నెక్స్ట్ ఆప్షన్ గా ఎన్టీఆర్ ను ఎంచుకున్నాడు. ఎన్టీఆర్‌కు స్టోరీ చెప్పగా.. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సినిమా సెట్స్‌పైకి వెళ్ళింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమా హిట్ కాకపోయినా.. సాంగ్స్ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పటికి ఈ సాంగ్స్ చాలాచోట్ల వినిపిస్తూనే ఉంటాయి.