వార్ 2.. కియారా రోల్ మిస్ చేసుకున్న గ్లామరస్ బ్యూటీ.. ఎవరంటే..?

బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 రిలీజ్ తాజాగా రిలీజ్‌అయిన సంగతి తెలిసిందే. కొద్ది గంటల క్రితం గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఎన్టీఆర్, హృతిక్‌ల‌ యాక్షన్ పర్ఫామెన్స్‌లతోపాటు.. ఎంట్రీ సీన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ అమ్మడి గ్లామర్ ట్రీట్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. బికినీ సీన్స్ పడినప్పుడు థియేటర్లో విజిల్స్ మాత్రం మోగిపోయిందంటూ టాక్ తెగ వైరల్ గా మారుతుంది.

Kiara Advani on her firsts from War 2: First action film, first bikini shot  - India Today

ఈ క్రమంలోనే వార్ 2లో కియారా అద్వాని రోల్‌.. మరో స్టార్ బ్యూటీ మిస్ చేసుకుందంటూ న్యూస్ నెటింట వైరల్ గా మారుతుంది. సాధారణంగా.. ఇండస్ట్రీలో సినీ హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ టచ్ కోసమే పనిచేస్తూ ఉంటారని అభిప్రాయాలు వ్య‌క్తం అవుతునాయి. దానికి తగ్గట్లుగానే 80 శాతం మంది హీరోయిన్స్ కేవలం గ్లామర్ రోల్ కే పరిమితం అయిపోతూ ఉంటారు. అయితే.. ఇప్పుడిప్పుడే కొంతమంది డైరెక్టర్లు హీరోయిన్లకు సైతం సమానమైన ఇంపార్టెన్స్ వచ్చేలా.. కథలను రాస్తున్నారు. అయితే.. బాలీవుడ్ లో ఇప్పటికీ కేవలం గ్లామర్ పాత్రలకే హీరోయిన్ పరిమితమయ్యేలా డైరెక్టర్ కథ‌లని రాస్తున్న సందర్భాలు ఉన్నాయి.

Alia Bhatt begged Ayan Mukerji to cast her opposite Ranbir Kapoor in  'Brahmastra' | Hindi Movie News - Times of India

వాటిలో.. తాజాగా వచ్చిన వార్ 2 సినిమా కూడా ఒకటి. సినిమాలోకి కియారా కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితమైందని.. ఆమె పాత్ర నడివి ఒక గెస్ట్ రోల్‌లా అనిపించిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాగా.. మొదట ఈ సినిమాలో కియారా రోల్ కోసం అలియా భట్ ను భావించాడట. వాళ్ళ మధ్య ఉన్న బాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మాస్త్ర సినిమాలో వీళ్ళ‌ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంది. అంతేకాదు.. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలియా భట్ రోల్‌ను సున్నితంగా రిజెక్ట్ చేసిందని సమాచారం. ఈ పాత్రకు తను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేము అనే భయంతో ఆమె పాత్రను రిజెక్ట్ చేసిందంటూ తెలుస్తుంది. తర్వాత ఈ పాత్ర‌ కోసం ప్రతి సంవత్సరం ఎంతో మంది స్టార్ హీరోయిన్లను అప్రోచ్ అయ్యారట. కానీ.. చివరకు కియారా అద్వాని ఈ పాత్రకు సెలెక్ట్ అయ్యింది. అయితే.. కియారా అద్వానితో సినిమాను ప్రారంభించేటప్పుడు చాలా సీన్స్ ఏ రాశారట. వాటిలో చాలా భాగాన్ని సినిమా పూర్తి అయ్యేసరికి ఎడిటింగ్ లో ట్రిమ్ చేసి సినిమాను రిలీజ్ చేశారంటూ టాక్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే కియారా రోలో ఒక గెస్ట్అపీరియన్స్ లా అనిపించింది.