వార్ 2.. రేవంత్ రెడ్డికి తారక్ క్షమాపణలు.. షాకింగ్ రీజ‌న్‌..!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆయన ముఖర్జీ దర్శకత్వంలో య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో టీం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ యూసఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్స్ లో చాలా గ్రాండ్గా నిర్వహించారు టీం .తమ స్పీచ్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు.

క్షమించండి అంటున్న ఎన్టీఆర్.. వీడియో ఫుల్ వైరల్ ! | jr ntr apologies to telangana government and video goes viral - Telugu Oneindia

ఇక ఎన్టీఆర్, హృతిక్ తో పాటు.. త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు లాంటి టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ ఈవెంట్లో మాట్లాడుతూ.. సినిమా కచ్చితంగా చూడాలని ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో సినిమా బ్లాక్ బస్టర్ కాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే.. ఈవెంట్ అంతా ముగిసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా తారక్ షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. చిన్న తప్పు జరిగిందంటూ తారక్ ఈ వీడియోను అందరితోను పంచుకున్నాడు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అసలు మేటర్ ఏంటంటే.. తారక్ ఈ వీడియోలో మాట్లాడుతూ ఇందాక ఈవెంట్లో ముఖ్యమైన విషయాన్ని చెప్పడం మర్చిపోయా.. అందరు నన్ను క్షమించాలి. అభిమానులతో పాతికేళ్ల జర్నీని పంచుకునే ఆనందంలో ఒక తప్పు చేశా అందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి.. వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు అంటూ వివ‌రించాడు.

Jr NTR Bows to Fans at War 2 Event, Calls Them His True Strength - NTV Telugu

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి.. ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి.. అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్, యావత్ తెలంగాణ పోలీస్ లందరికీ నా కృతజ్ఞతలు. శిరస్సు వంచి పాదాభివందనాలు అంటూ చెప్పుకొచ్చాడు. మీ సహాయ సహకారాలు మాకు అందించినందుకు ధన్యవాదాలు అంటూ ఆ వీడియోలో షేర్ చేసుకున్నాడు. వార్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ప్రసంగం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ప్రస్తావించపోవడానికి క్షమాపణలు తెలుపుతూ.. కార్యక్రమం ముగిసిన తర్వాత ఎన్టీఆర్ ఈ వీడియోను షేర్ చేశారు. వెంటనే తన తప్పు సరిదిద్దుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది.